AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఫుల్‌స్టాప్ పెట్టనుందా? తెరవెనుక కీలక దౌత్యం!

ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు న్యూఢిల్లీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. రష్యా, ఉక్రెయిన్‌తో పాటు ఈ వ్యవహారంలో భాగస్వాములైన ఇతర దేశాలతోనూ అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో భారత్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఫుల్‌స్టాప్ పెట్టనుందా? తెరవెనుక కీలక దౌత్యం!
India Peace Efforts
Balaraju Goud
|

Updated on: Nov 11, 2026 | 8:45 AM

Share

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు న్యూఢిల్లీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. రష్యా, ఉక్రెయిన్‌తో పాటు ఈ వ్యవహారంలో భాగస్వాములైన ఇతర దేశాలతోనూ అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో భారత్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం కనుగొనే దిశగా భారత్ నిరంతరం ప్రయత్నిస్తోందని తెలిపారు. మాస్కో, కీవ్‌తో పాటు ఇతర సంబంధిత పక్షాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఈ చర్చలు అత్యున్నత స్థాయిలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరపగా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామాలు శాంతి ప్రయత్నాలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.

శాంతి ఒప్పందంలో కీలక అంశాలు

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు నల్ల సముద్రంలో నౌకల రాకపోకలను పునరుద్ధరించడం, ధాన్యం, ఇంధన ఎగుమతులకు ఆటంకాలు లేకుండా చూడటం, పరస్పర దాడులకు పాల్పడకుండా ఒప్పందం కుదుర్చుకోవడం వంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ అంశాలపై ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరేలా భారత్ ప్రయత్నిస్తోంది.

లక్షలాది మందిపై యుద్ధ ప్రభావం

2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి సైనిక దాడి ప్రారంభించడంతో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ఇప్పటివరకు కనీసం 17,968 మంది పౌరులు మరణించారు. యూఎన్‌హెచ్‌సీఆర్, ఐఓఎం గణాంకాల ప్రకారం సుమారు 95 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో 59 లక్షల మంది ఇతర దేశాల్లో శరణార్థులుగా ఉండగా, మరో 36 లక్షల మంది దేశంలోనే సొంత నివాసాలను కోల్పోయారు.

ఇన్నేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి తెరపడితే ప్రపంచ దేశాలకు భారీ ఊరట లభించనుంది. అయితే శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వస్తాయా? భారత్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us