AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ డబ్బుతో మీకు నచ్చింది కొనలేరా? ముందు అపరిచితుల ఓటింగ్.. చైనాలో వింత యాప్ వైరల్!

ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు నచ్చిందంటే చాలు వెంటనే కార్ట్‌లో వేసి ఆర్డర్ చేసేస్తుంటారు చాలామంది. ఆఫర్ కనిపిస్తే అసలు అవసరం లేకపోయినా కొనుగోలు చేయడానికి వెనుకాడరు. తీరా వస్తువు ఇంటికి వచ్చాక ఎందుకు కొన్నామా అని బాధపడుతుంటారు. ఇలాంటి అనవసరపు ఖర్చులకు చెక్ పెట్టేందుకు చైనాలో ఓ కొత్త ప్రయోగం మొదలైంది. ఇక్కడ మీకు నచ్చిన వస్తువును కొనాలంటే మీ ఒక్కరి నిర్ణయం సరిపోదు. ముందుగా కొంతమంది అపరిచితుల అభిప్రాయం తీసుకోవాలి.

మీ డబ్బుతో మీకు నచ్చింది కొనలేరా? ముందు అపరిచితుల ఓటింగ్.. చైనాలో వింత యాప్ వైరల్!
China Viral App Lets Strangers Decide Whether You Should Spend Your Money
Sharada V
|

Updated on: Nov 10, 2026 | 10:16 AM

Share

ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు నచ్చిందంటే చాలు వెంటనే కార్ట్‌లో వేసి ఆర్డర్ చేసేస్తుంటారు చాలామంది. ఆఫర్ కనిపిస్తే అసలు అవసరం లేకపోయినా కొనుగోలు చేయడానికి వెనుకాడరు. తీరా వస్తువు ఇంటికి వచ్చాక ఎందుకు కొన్నామా అని బాధపడుతుంటారు. ఇలాంటి అనవసరపు ఖర్చులకు చెక్ పెట్టేందుకు చైనాలో ఓ కొత్త ప్రయోగం మొదలైంది. ఇక్కడ మీకు నచ్చిన వస్తువును కొనాలంటే మీ ఒక్కరి నిర్ణయం సరిపోదు. ముందుగా కొంతమంది అపరిచితుల అభిప్రాయం తీసుకోవాలి. వారు మీ కొనుగోలుకు అనుకూలంగా ఓటు వేస్తేనే ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో ఓ కొత్త మినీ ప్రోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది. ‘Wallet, Please Wait’ పేరుతో వస్తున్న ఈ వినూత్న కాన్సెప్ట్ ఇప్పుడు చైనాలో తెగ వైరల్ అవుతోంది.

వస్తువు వివరాలు పెట్టాలి.. అపరిచితులు ఓటు వేయాలి!

సాధారణంగా మనం షాపింగ్ చేసేటప్పుడు ఏ వస్తువు కొనాలనేది మనమే నిర్ణయించుకుంటాం. కానీ ఈ ప్రోగ్రామ్‌లో మాత్రం అలా కాదు. మీరు కొనాలనుకున్న వస్తువు ఏంటి? దాని ధర ఎంత ఆ వివరాలను ఇందులో నమోదు చేయాలి. ఆ తర్వాత ఇతర వినియోగదారులు ఆ కొనుగోలు అవసరమా? లేదా? అనే విషయంపై తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేస్తారు.

అంటే మీకు ఓ వస్తువు బాగా నచ్చినా, దాన్ని కొనాలనే కోరిక బలంగా ఉన్నా.. ఒక్కసారి ఇతరుల అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవసరం లేని వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారా? ఆ వస్తువు కోసం అంత మొత్తం వెచ్చించడం సరైనదేనా? అనే విషయాలను ఇతరులు ఆలోచించి తమ ఓటు వేస్తారు. ఇలా కొనుగోలు చేసే ముందు ఒకసారి ఆలోచించేలా చేయడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం.

ఏఐ సాయంతో ప్రోగ్రామ్.. ఇప్పటికే 3 లక్షల మంది!

చైనాలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వీచాట్‌లో ఈ మినీ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పనిచేసే ఈ వినూత్న టూల్‌కు ఇప్పటికే 3 లక్షల మందికి పైగా వినియోగదారులు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా జెన్‌జీ యువతలో దీనిపై ఆసక్తి పెరుగుతోంది.

నిజానికి చాలామంది యువత ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్లు, భారీ డిస్కౌంట్లు చూసి అవసరం లేని వస్తువులను కూడా కొంటున్నారు. ఫలితంగా నెలవారీ బడ్జెట్ దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఓ కొత్త మార్గంగా కనిపిస్తోంది.

షాపింగ్ ఫెస్టివల్ వేళ మరింత క్రేజ్!

చైనాలో నవంబర్ 11న నిర్వహించే డబుల్ 11 షాపింగ్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీంతో లక్షలాది మంది వినియోగదారులు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తుంటారు. అయితే ఆఫర్ల మోజులో పడి అవసరం లేని వస్తువులు కొనకుండా ఉండేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ‘Wallet, Please Wait’ ప్రోగ్రామ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఏది పడితే అది కొనేయకుండా ఒక్కసారి ఆలోచించి ఖర్చు చేయాలనే ఆలోచనను ఇది ప్రోత్సహిస్తోంది. మన డబ్బు మన ఇష్టం మనమే ఖర్చు పెట్టుకోవచ్చు అనుకునే రోజుల్లో, మన కొనుగోలుకు అపరిచితుల ఓటు ఎందుకు? అనే ఆసక్తికర చర్చకు ఈ ప్రోగ్రామ్ తెరలేపింది.

మొత్తానికి షాపింగ్ పిచ్చికి కళ్లెం వేయడానికి చైనా యువత ఎంచుకున్న ఈ కొత్త దారి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రేపు మన దగ్గర కూడా ఇలాంటి యాప్‌లు వస్తే మనం కొనాలనుకునే ప్రతి వస్తువుకు ఇతరుల అనుమతి తీసుకుంటామా? ఏమో చూడాలి!

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి

Follow Us
మీ డబ్బుతో మీకు నచ్చింది కొనలేరా? ముందు అపరిచితుల ఓటింగ్!
మీ డబ్బుతో మీకు నచ్చింది కొనలేరా? ముందు అపరిచితుల ఓటింగ్!
పండుగప్ప చిక్కిందిరోయ్.. జాలర్ల పంట పండింది.. ఎంత పలికిందో తెలుసా
పండుగప్ప చిక్కిందిరోయ్.. జాలర్ల పంట పండింది.. ఎంత పలికిందో తెలుసా
పాల ఉప్మా ఎప్పుడైనా చేశారా? ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా..
పాల ఉప్మా ఎప్పుడైనా చేశారా? ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా..
గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో 2,929 ఉద్యోగాల భర్తీకి కసరత్తు!
గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో 2,929 ఉద్యోగాల భర్తీకి కసరత్తు!
చేపల వేటకు వెళ్లిన వారికి ఊహించని షాక్.. వాగులో మొసలి ప్రత్యక్షం
చేపల వేటకు వెళ్లిన వారికి ఊహించని షాక్.. వాగులో మొసలి ప్రత్యక్షం
ఆ విషయంపై కోహ్లీని ప్రశ్నించాలంటే కోచ్‌లు భయపడతారు..
ఆ విషయంపై కోహ్లీని ప్రశ్నించాలంటే కోచ్‌లు భయపడతారు..
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం.. 71గ్రామాల్లో అంతర్జాతీయ నగరం
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం.. 71గ్రామాల్లో అంతర్జాతీయ నగరం
'ఒక్క చేత్తో ఏనుగును ఎలా ఎత్తగలరు?' UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
'ఒక్క చేత్తో ఏనుగును ఎలా ఎత్తగలరు?' UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
రూ.35లకే సినిమాలు, వెబ్ సిరీస్‌లు..Vi నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్
రూ.35లకే సినిమాలు, వెబ్ సిరీస్‌లు..Vi నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్