సీన్‌లోకి ‘పవార్’.. కూటమిని నిలబెడతారా..!

| Edited By:

May 22, 2019 | 1:43 PM

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. అయితే ఎగ్జిట్‌పోల్స్ అన్నీ మళ్లీ ఎన్డీయేదే అధికారమని చెబుతున్నాయి. అయినా విపక్షాలు తమ ఆశలను వదులుకోవడం లేదు. ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్న వారు.. కచ్చితంగా హంగ్ ఏర్పడుతుందనే భావనలో ఉన్నారు. దీంతో ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మహాకూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పార్టీనేతలతో విస్తృత సంప్రదింపులు జరుపుతుండగా.. తాజాగా మరోవైపు ఎన్పీపీ నేత శరద్ పవార్ లైన్‌లోకి […]

సీన్‌లోకి ‘పవార్’.. కూటమిని నిలబెడతారా..!
Follow us on

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. అయితే ఎగ్జిట్‌పోల్స్ అన్నీ మళ్లీ ఎన్డీయేదే అధికారమని చెబుతున్నాయి. అయినా విపక్షాలు తమ ఆశలను వదులుకోవడం లేదు. ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్న వారు.. కచ్చితంగా హంగ్ ఏర్పడుతుందనే భావనలో ఉన్నారు. దీంతో ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మహాకూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పార్టీనేతలతో విస్తృత సంప్రదింపులు జరుపుతుండగా.. తాజాగా మరోవైపు ఎన్పీపీ నేత శరద్ పవార్ లైన్‌లోకి వచ్చారు. ఆశ్చర్యంగా ఆయన చంద్రబాబులా కాకుండా.. తటస్థ పార్టీనేతలందరితోనూ టచ్‌లో ఉంటూ సరికొత్త వ్యూహానికి తెరతీశాడు.

కేంద్రంలో ఒకవేళ బీజేపీ రాని పక్షంలో ప్రతిపక్షాలతో పాటు ఇవి కూడా కీలక పాత్ర పోషించేలా వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ మధ్యవర్తిగా వైసీపీ అధినేత జగన్‌తోనూ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోనూ ఆయన ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు నవీన్ పట్నాయక్ కూడా పవార్‌ వ్యూహానికి మద్దతుగానా అన్నట్లు ఈ ఫలితాలు యూపీఏకు అనుకూలంగా వచ్చిన పక్షంలో కచ్చితంగా తాము కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా.. గురువారం వెల్లడయ్యే ఫలితాలు వారి వారి జాతకాలను తేల్చనున్నాయి.