TDP Atchannaidu: “మా పార్టీ అధికారంలోకి వస్తే నేనే హోం మినిస్టర్.. అప్పుడు అందరి అంతు తేలుస్తా”

ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తానే హోమంత్రిని అవుతానన్నారు.

TDP Atchannaidu: మా పార్టీ అధికారంలోకి వస్తే నేనే హోం మినిస్టర్.. అప్పుడు అందరి అంతు తేలుస్తా
Follow us

|

Updated on: Feb 02, 2021 | 1:25 PM

TDP Atchannaidu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తానే హోమంత్రిని అవుతానన్నారు. చంద్రబాబును కోరి హోంశాఖ తీసుకుంటానని చెప్పారు. అప్పుడు అందరి అంతు చూస్తానన్నారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఈ కేసుల్ని చూసి భయపడే వ్యక్తిని కాదన్నారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసు అధికారులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు.

కాగా మంగళవారం ఉదయం అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిమ్మాడ టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా అచ్చెన్న సతీమణి బరిలోకి దిగారు. మరోవైపు అచ్చెన్నాయుడి సోదరుడి కొడుకు అప్పన్న వైసీపీ బలపర్చిన అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావించారు. ఇక్కడే వివాదం రాజుకుంది. అప్పన్నను అచ్చెన్నాయుడు బెదిరింపులకు గురి చేసినట్లు ఆరోపణలపై కేసు నమోదైంది. దీనిపై పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలంతా ఖండించారు.  ఇక నేడు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నిమ్మాడకు వెళ్లనున్నారు. అప్పన్నను పరామర్శించి అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు.

Also Read:

Atchannaidu Arrest : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్.. నిమ్మాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై భగ్గుమన్న బోండా.. అందుకే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే