మురికి కాల్వలో మానవత్వం: మంచు విష్ణు
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలపై మోహన్ బాబు కుమారుడు, సినీ హీరో మంచు విష్ణు స్పందించారు. వివేకానందరెడ్డి అంకుల్ హత్యపై కొందరి మాటలు వింటుంటే మానవత్వం మురికి కాలువల్లో కొట్టుకుపోతుందా అన్న భావన కలుగుతోందని అన్నారు. ఈ దారుణమైన ఘటనను ఖండించడం మానేసి రాజకీయం చేయడం, బురద జల్లడం చూస్తుంటే వాళ్లకు అసలు బుర్ర ఉందా అని అనిపిస్తోందని సోసల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. Humanity seems to be going […]
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలపై మోహన్ బాబు కుమారుడు, సినీ హీరో మంచు విష్ణు స్పందించారు. వివేకానందరెడ్డి అంకుల్ హత్యపై కొందరి మాటలు వింటుంటే మానవత్వం మురికి కాలువల్లో కొట్టుకుపోతుందా అన్న భావన కలుగుతోందని అన్నారు. ఈ దారుణమైన ఘటనను ఖండించడం మానేసి రాజకీయం చేయడం, బురద జల్లడం చూస్తుంటే వాళ్లకు అసలు బుర్ర ఉందా అని అనిపిస్తోందని సోసల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు.
Humanity seems to be going down the drain when I hear some politicians talk about the murder of YS Vivenkananda uncle. Instead of condemning the heinous act, politicizing and mud slinging seems to be in the pea sized brains.
— Vishnu Manchu (@iVishnuManchu) March 16, 2019
దివంగత వైఎస్పార్ సోదరుడి కుమార్తె విరనికాను మంచు విష్ణు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విరనిక ఈ సంఘటనపై స్పందిస్తూ సిట్ విచారణ గానీ, బీసీఐ విచారణ ద్వారా గానీ న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదని చెప్పింది. దేవుడు అంతా చూస్తున్నాడని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ఆయన చేతుల నుండి తప్పించుకోలేరని పోస్ట్ చేసింది. మా పెద్దనాన్న చాలా మంచి మనిషి అంటూ తన సోషల్ మీడియాలో విరనికా పోస్ట్ పెట్టింది.
I can’t believe what the world has come to! SIT, CBI whatever will never bring justice. There is a God watching and who ever did this, they can’t escape His wrath. My Peddananna was a good and kind hearted man. #RIP #VivekanandaReddy
— Viranica Manchu (@vinimanchu) March 16, 2019