రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులందరికీ ఉచితంగా కోవిడ్‌ వాక్సిన్‌, రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ

| Edited By: Phani CH

Apr 23, 2021 | 5:45 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులందరికీ ఉచితంగా కోవిడ్‌ వాక్సిన్‌ ఇవ్వాలని జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులందరికీ  ఉచితంగా కోవిడ్‌ వాక్సిన్‌, రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ
Free Corona Vaccination In Andhra Pradesh
Follow us on

Free corona vaccination : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులందరికీ ఉచితంగా కోవిడ్‌ వాక్సిన్‌ ఇవ్వాలని జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 2, 04, 70, 364 మంది కరోనా టీకా ఫ్రీగా పొందగలుగుతారు. అంతేకాదు, కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రేపటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి తెస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా శనివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. రాత్రి 10 గంటలనుంచి ఉదయం 5గంటలవరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే, కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు నిస్తారు. ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాలను తీర్చే విధంగా మరిన్ని కోవిడ్‌ డోసులను పంపించాలని భారత్‌ బయోటెక్, హెటిరో డ్రగ్స్‌ ఎండీలను సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. భారత్‌ బయోటెక్, హెటిరో డ్రగ్స్‌ ఎండీలతో ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని డోసులు పంపించాలని కోరారు. అదే విధంగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను సరఫరా చేయాలన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Vaccination: టీకాతో ఆ దేశాల్లో ఆగిన కరోనా కల్లోలం..వ్యాక్సిన్ ప్రభావం ఆ ఆరు దేశాల్లో ఎలా పనిచేసింది?

Andhrapradesh: ఏపీలోని ప‌లు జిల్లాల‌కు పిడుగు హెచ్చ‌రిక‌.. కీల‌క సూచ‌న‌లు చేసిన విప‌త్తుల శాఖ‌