Actress Gayathri Raghuram: అన్నాడీఎంకే పార్టీలో చేరిన సినీ నటి గాయత్రి రఘురాం.. ‘ఎప్పుడో చేరాల్సింది. కానీ..’

|

Jan 19, 2024 | 5:29 PM

సినీ నటి గాయత్రి రఘురామ్‌ అన్నాడీఎంకే పార్టీలో చేరారు. గత ఏడాది భారతీయ జనతా పార్టీని వీడిన నటి గాయత్రి అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతర అన్నాడీఎంకేలో చేరారు. 2014 డిసెంబర్ 20న నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెన్నైకి రాగా.. ఆయన సమక్షంలో నటి గాయత్రి బీజేపీలో చేరారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ చెన్నై పర్యటనకు..

Actress Gayathri Raghuram: అన్నాడీఎంకే పార్టీలో చేరిన సినీ నటి గాయత్రి రఘురాం.. ఎప్పుడో చేరాల్సింది. కానీ..
Actress Gayathri Raghuram
Follow us on

చెన్నై, జనవరి 19: సినీ నటి గాయత్రి రఘురామ్‌ అన్నాడీఎంకే పార్టీలో చేరారు. గత ఏడాది భారతీయ జనతా పార్టీని వీడిన నటి గాయత్రి అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతర అన్నాడీఎంకేలో చేరారు. 2014 డిసెంబర్ 20న నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెన్నైకి రాగా.. ఆయన సమక్షంలో నటి గాయత్రి బీజేపీలో చేరారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ చెన్నై పర్యటనకు వచ్చిన రోజునే గాయత్రి అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు.

‘చాలా కాలం క్రితమే నేను అన్నాడీఎంకేలో చేరాల్సి ఉంది. కానీ ఈరోజు శుభదినం కావడంతో పార్టీలో చేరాను. మా నాన్న డ్యాన్స్ మాస్టర్ రఘురాం, మా తాత, సినీ దర్శకుడు కె. సుబ్రమణ్యం, ఆయన కుమార్తె పద్మా సుబ్రమణ్యంలకు అన్నాడీఎంకేతో చాలా కాలంగా అనుబంధం ఉంది. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి జే జయలలిత మా కుటుంబ సభ్యులలాంటి వారు. మా నాన్న రఘురాం అన్నాడీఎంకే పార్టీ కోసం పలు సందర్భాల్లో పని చేశారని గుర్తుచేసుకున్నారు. ఇటీవల తమిళనాడులో సంభవించిన వరదలు, భారీ వర్షాల తర్వాత తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని గాయత్రి రఘురామ్ అన్నారు. అన్నాడీఎంకేను ప్రజలు చాలా మిస్ అవుతున్నారని ఆమె తన ట్వీట్‌లో తెలిపారు. అన్నాడీఎంకేలో చేరడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్టీని ప్రశంసల్లో ముంచెత్తారు. పార్టీ ప్రారంభమైన 50 యేళ్లలో 30 యేళ్లు రాష్ట్రాన్ని పాలించిందని, తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుగు సాగుతుందని అన్నారు. మైనారిటీల సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని, రిజర్వేషన్లు అమలు చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా తమిళనాడులో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌లలో గాయత్రి రఘురామ్ ఒకరు. నాటి ఎన్నికల్లో మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించారు. ఆ తర్వాత 2020లో గాయత్రి రఘురామ్‌ణు బీజేపీ రాష్ట్ర యూనిట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగానికి కొత్త అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అనంతరం పార్టీ ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల తమిళ అభివృద్ధి విభాగానికి అధ్యక్షురాలిగా కొనసాగారు. అయితే ఆమె పార్టీ పేరు చెడగొట్టే పలు కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ 2022, నవంబర్ 22న బీజేపీ ఆరు నెలల పాటు సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన గాయత్రి రఘురామ్, ఎనిమిదేళ్లపాటు పార్టీ కోసం కష్టపడ్డానని అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో మహిళలకు భద్రత లేదని ఆమె ఆరోపించారు. ఇక గతేడాది జనవరి 3న బీజేపీకి గుడ్‌బై చెప్పిన గాయత్రి.. తన నిష్క్రమణకు అన్నామలైని నిందించింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో గాయత్రి రఘురామ్‌, అన్నామలై మధ్య వార్‌ నడుస్తూనే ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.