Etela-Motkupalli: మోత్కుపల్లి నర్సింహులు విమర్శలకు ఈటల రాజేందర్ కౌంటర్..

మోత్కుపల్లి నర్సింహులు చేసిన ఆరోపణలపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. మోత్కుపల్లి నర్సింహులుతో నాపై విమర్శలు చేయించారని అన్నారు. మోత్కుపల్లి..

Etela-Motkupalli: మోత్కుపల్లి నర్సింహులు విమర్శలకు ఈటల రాజేందర్ కౌంటర్..
Etela Motkupalli

Updated on: Jul 23, 2021 | 8:55 PM

తెలంగాణలో రాజకీయ హీట్ మొదలైంది. మోత్కుపల్లి నర్సింహులు చేసిన ఆరోపణలపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. మోత్కుపల్లి నర్సింహులుతో నాపై విమర్శలు చేయించారని అన్నారు. మోత్కుపల్లి పేరు తీసుకోవడం తనకు ఇష్టం లేదని అన్నారు. తన దగ్గర ఒక్క ఎకరం భూమి అక్రమంగా ఉన్నా ముక్కు నేలకు రాస్తానని ఈటల మరోసారి గుర్తు చేశారు. ఏ ఎంక్వైరీ అయినా వేయమని డిమాండ్ చేస్తున్నాను అని సవాల్ విసిరారు. నాలాంటి వానిమీద ఆరోపణలు చేస్తే మా ఉసురు తగిలుతుందని విమర్శించారు. తాను రుషిని కాదు శపించడానికి.. కానీ ధర్మమంటూ ఉంది అది ఇప్పుడు కాకున్నా.. ఎప్పటికైనా మీకు తగిలితీరుతుందని మండి పడ్డారు.

“కానీ కిరాయి మనుషులకు డబ్బులిచ్చి ఇలాంటి చిల్లర ఆరోపణలు చేయించి ధర్మాన్ని గాయపరిచే ప్రయత్నం చేస్తే ఖబర్ధార్ అంటూ హెచ్చరించారు. మళ్లీ ఛాలెంజ్ చేస్తున్నా.. నీ దగ్గర అధికారం ఉంది. ఎంక్వైరీ చేయించు. తప్పని తేలితే ముక్కు నేలకు రాస్తే.. లేదంటే నీవు రాస్తావా? అంటూ ఈటల సవాల్ విసిరారు.

“ఆనాడు నయీంలాంటి గూండాలతో చంపించాలని చూసినా నేను భయపడలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై గంటలకొద్ది పడుకున్నోళ్లం… ఎక్కడ తిన్నమో, ఎక్కడ పడుకున్నమో, మా మీద ఎన్నికేసులున్నవో తెలంగాణప్రజలకు తెలియదా..” అంటూ ప్రశ్నించారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఎన్నికలను ఎదుర్కొన్నా… 18 ఏళ్లలో ఆరు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచానంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: Telangana Politics 2023: తెలంగాణలో రాజకీయ రణం మొదలైందా.. ఈ పోరు ఆ దిశగానేనా..

 TTD – Anti Drone: తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ.. ఆలయ రక్షణలో డీఆర్‌డీవో సాంకేతికత

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..