ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు

ఏపీలో ఎన్నికల తేది దగ్గరపడుతోన్న వేళ ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఐపీఎస్‌లపై బదిలీ వేటు వేసింది. ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను ట్రాన్స్‌ఫర్ చేసింది. వారిద్దరినీ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. చంద్రబాబు నాయుడుకు, టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ ముగ్గురిపై వైసీపీ నేతల ఫిర్యాదు చేశారు. […]

ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2019 | 8:43 AM

ఏపీలో ఎన్నికల తేది దగ్గరపడుతోన్న వేళ ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఐపీఎస్‌లపై బదిలీ వేటు వేసింది. ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను ట్రాన్స్‌ఫర్ చేసింది. వారిద్దరినీ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. చంద్రబాబు నాయుడుకు, టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ ముగ్గురిపై వైసీపీ నేతల ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే ఎన్నికల కమిషన్ వారిపై బదిలీ వేటును వేస్తూ నిర్ణయం తీసుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.