AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కె.ఎ.పాల్‌కు ఈసీ షాక్‌.. రద్దు దిశగా పార్టీ గుర్తు

మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టింది. ఆయన హెలికాప్టర్‌ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండడంతో ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల దాన్ని తొలగించాలని వైసీపీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పాల్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పాల్‌ ప్రపంచంలో ఎక్కడైనా […]

కె.ఎ.పాల్‌కు ఈసీ షాక్‌.. రద్దు దిశగా పార్టీ గుర్తు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 10, 2019 | 4:56 PM

Share

మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టింది. ఆయన హెలికాప్టర్‌ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండడంతో ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల దాన్ని తొలగించాలని వైసీపీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పాల్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పాల్‌ ప్రపంచంలో ఎక్కడైనా హెలికాప్టర్‌, ఫ్యాన్‌ ఒకేలా ఉండడం చూశామా? ఇందులో వైసీపీ దురుద్దేశం ఉందని ఆరోపించారు. రెండు గుర్తుల మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించగలరని ఈసీకి సమాధానమిచ్చారు. పాల్‌ స్పందనను పెద్దగా పట్టించుకోని ఈసీ.. ఆయన గుర్తును పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలానే గుర్తుల గొడవ జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో పొలి ఉన్న ట్రక్కు గుర్తును పలువురు ఇండిపెండెంట్లకు కేటాయించారు. అయితే వీరందరికీ అంచనాలకు మించి ఓట్లుపడ్డాయి. కారు, ట్రక్కూ రెండూ ఒకేలా ఉండటంతో ప్రజలు పొరపాటున ట్రక్కుకు వేశారని టీఆర్ఎస్ అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ట్రక్కు గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు. తమకు పడాల్సిన ఓట్లు కారు గుర్తుకు పడ్డాయనీ, కారణం ట్రక్కు, కారు గుర్తులు ఒకేలా ఉండటమేనని అన్నారు. ఈ రెండు వాదనలూ విన్న ఎన్నికల సంఘం… ప్రస్తుతానికి ట్రక్కు గుర్తును పక్కన పెట్టింది. ఇకపై ఎక్కడ ఎన్నికలు జరిగినా… గుర్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్న ఈసీ… హెలికాఫ్టర్ గుర్తును రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఐతే పాల్ మాత్రం హెలికాఫ్టర్ గుర్తు తొలగించకుండా ఉండాలని కోరుకుంటున్నారు.

Follow Us
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..