ఓటర్లలో హెచ్చు తగ్గులు, పని చేయని ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణ

| Edited By: Phani CH

Mar 27, 2021 | 3:49 PM

బెంగాల్ తొలిదశ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య  ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఓటర్ల సంఖ్యలో హెచ్చు తగ్గులు, తేడాలు కనిపిస్తున్నాయని, ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగా పని చేయడం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది.

ఓటర్లలో హెచ్చు తగ్గులు, పని చేయని ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణ
Mamata Banerjee
Follow us on

బెంగాల్ తొలిదశ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య  ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఓటర్ల సంఖ్యలో హెచ్చు తగ్గులు, తేడాలు కనిపిస్తున్నాయని, ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగా పని చేయడం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఇందుకు బీజేపీయే కారణమని ఆరోపించింది. మధ్యాహ్నం 12 గంటలవరకు 36 శాతం ఓటింగ్ నమోదైందని అధికార లెక్కలు చెబుతున్నాయి. దీనిపై టీఎంసీ  నేత డెరెక్ ఓబ్రీన్ ఈసీకి లేఖ రాస్తూ.. ఇదంతా బీజేపీ ఎత్తుగడగా పేర్కొన్నారు. ఈ పార్టీ ప్రతినిధిబృందం కూడా ఈసీని కలిసి ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగా పని చేయడం లేదని అన్నారు. ఈస్ట్ మెడినిపూర్ జిల్లాలో ఈ యంత్రాలకు ఏమైందని, ఓటర్ల సంఖ్య కేవలం 5 నిముషాల్లో  సగానికి సగం  చాలావరకు తగ్గిపోయిందని, ఇదెలా సాధ్యమని వారు ప్రశ్నించారు. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించాలని వారు కోరారు. ఇక కాంతీ దక్షిణ్ నియోజకవర్గంలో ఓటర్లు తృణమూల్  కాంగ్రెస్ కి ఓటేస్తే వీవీ పాట్ లో వారు బీజేపీ గుర్తుకు వేసినట్టు కనిపిస్తోందని, ఇదెక్కడి అన్యాయమని కూడా వారన్నారు.  కొందరు ఓటర్లు స్వయంగా ఈ విషయాన్ని తెలిపారన్నారు. ఇది చాలా సీరియస్ అని , క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బూత్ ఏజంట్ల సిస్టం నుమార్చాలని బీజేపీ ఓ మెమోరాండం ను సమర్పించిందని, కానీ దీనివల్ల ప్రయోజనం ఉంటుందా అన్న  అంశాన్ని ఈసీ పరిశీలించాలని తాము ఎలెక్టోరల్ ఆఫీసర్ ను కోరినట్టు టీఎంసీ నేత   సుదీప్ బందోపాధ్యాయ తెలిపారు. కొత్త విధానాన్ని తాము అనుమతించబోమన్నారు. తదుపరి దశ నుంచి పోలింగ్ ఏజెంటు సంబంధిత పోలింగ్ కేంద్రానికి లోకల్ అయి ఉండాలని మేము కోరుతున్నాం అని ఆయన చెప్పారు. 2016 నాటి ఎన్నికల్లో మధ్యాహ్నం సుమారు 80 శాతం పోలింగ్ జరగ్గా ఈ సారి మధ్యాహ్నం 12 గంటల సమయానికి 36 శాతం మాత్రం నమోదైనట్టు లెక్కలు చెబుతున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో లోప భూయిష్టమైన  ఎలెక్ట్రానిక్ యంత్రాలను వాడుతున్నారని సీఎం మమతా బెనర్జీ ఇదివరకే ఫిర్యాదు చేశారు . దీనిపై ప్రధాని మోదీ ఆమెకు కౌంటర్ ఇస్తూ… ఈ పదేళ్లలో ఈ యంత్రాలే మీ పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టాయన్న విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి: Govinda Raja Swamy Temple Theft : గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం, సీసీ టీవీ కెమారాల్లో దొంగ కదలికలు

రోజుకు ఎనిమిది సార్లు తినడమే ఫిట్‌నెస్.. బాలీవుడ్ వెటరన్ బ్యూటీ డైట్ గురించి చెబుతున్న న్యూట్రిషనిస్ట్