Fake Vote: తాండూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకంపనలు.. దొంగ ఓటు ఆరోపణల దుమారం.. కలెక్టర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

|

Mar 22, 2021 | 6:47 PM

ఎమ్మెల్సీ ఎన్నికలు తాండూర్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే.. స్వయంగా మున్సిపల్‌ చైర్ పర్సనే.. దొంగవోటు వేశారన్న ఆరోపణలు దుమారం రేపాయి. తనది కాని ఓటును తాండూరు మున్సిపల్

Fake Vote:  తాండూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకంపనలు.. దొంగ ఓటు ఆరోపణల దుమారం.. కలెక్టర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
Tatikonda Swapna
Follow us on

Tatikonda swapna: ఎమ్మెల్సీ ఎన్నికలు తాండూర్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే.. స్వయంగా మున్సిపల్‌ చైర్ పర్సనే.. దొంగవోటు వేశారన్న ఆరోపణలు దుమారం రేపాయి. తనది కాని ఓటును తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న వేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు.. తాండూర్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిది కూడా దొంగ వోటే అని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

ఈరోజు అడిషనల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో దొంగవోటుకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ సాగింది. దీనికి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డితోపాటు.. కంప్లైంట్‌ చేసిన రామ్మోహన్‌రెడ్డి, ఆరోపణలు ఎదుర్కొంటున్న తాటికొండ స్వప్న హాజరయ్యారు. తను పట్టభద్రురాలు కాదని తెలిసికూడా దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నని పదవి నుంచి భర్తరప్ చేయాలని డిమాండ్‌ చేశారు చిన్నారెడ్డి. దొంగవోట్లు, ప్రలోభాల వల్లే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించిందన్నారు. స్వప్నపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషినల్‌ కలెక్టర్ మోతీలాల్‌ ముందు తమ వాదనలు వినిపించామన్నారు చిన్నారెడ్డి.

మరోవైపు తాండూర్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిపైనా కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేశారు. ఆయన అమెరికాలో పైలట్‌గా ట్రైనింగ్‌ చేసి.. ఆ సర్టిఫికేట్‌తో ఇక్కడ వోటు వేశారన్నారు. ఆయన డిగ్రీ ఇక్కడ చెల్లదని ఆరోపించారు. పైలట్‌ రోహిత్‌రెడ్డి కూడా అధికారులను మభ్యపెట్టి దొంగవోటు వేశారని మండిపడ్డారు.

మరోవైపు తాటికొండ స్వప్న విషయంలో ఇన్వెస్టిగేషన్‌ సాగుతోందన్నారు అడిషనల్‌ కలెక్టర్‌ మోతీలాల్‌. ఈరోజు ఇరువర్గాల వాదనలు విని రికార్డు చేశామన్నారు. పై అధికారులకు పూర్తి వివరాలు తెలియజేసి తగిన యాక్షన్‌ తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి: TS PRC Calculator 2021: పీఆర్‌సీలో మీకు పెరిగిన జీతం ఎంతో తెలుసా.. అయితే ఈ క్యాలిక్యులేటర్‌తో చూసుకోండి..!

AADHAR CARD: పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ‘జీవన్ ప్రమాణ్’ కోసం ఆధార్ తప్పనిసరి కాదన్న కేంద్రం

ఈ పనిని 10 రోజుల్లో చేయండి..! లేకపోతే మీ పాన్ కార్డు పనికిరాదు..! 10 వేల వరకు ఫైన్ కూడా పడే ఛాన్స్..!