ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఓరుగల్లు కాంగ్రెస్‌కు షాక్‌.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో గులాబీలో చేరికలు

దేశంలో పార్టీ కార్యకర్తలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించిన ఘనత కేవలం టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు..

  • K Sammaiah
  • Publish Date - 3:29 pm, Mon, 22 February 21
ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఓరుగల్లు కాంగ్రెస్‌కు షాక్‌.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో గులాబీలో చేరికలు

దేశంలో పార్టీ కార్యకర్తలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించిన ఘనత కేవలం టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండలం ఆరెగూడెంకు చెందిన 30 మంది కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు అధికారపార్టీలో చేరారు. హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో వారికి ఎర్రబెల్లి దయాకర్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దేశంలో 60 లక్షల సభ్యత్వాలను ఆన్‌లైన్‌ చేసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు మంత్రి ఎర్రబెల్లి. పార్టీలో చేరిన ప్రతి సభ్యుడికి సముచిత గౌరవం దక్కుతుందని చెప్పారు. టీఆరెఎస్ లో చేరిన వారిలో…యార మహేందర్, యారా ఉపేందర్, అనుమల యాకయ్య, యారా సుధాకర్, యారా నాగయ్య, యారా కరుణాకర్,అనుమల పెద్ద యాకయ్య, పెండ్లి మల్లేష్, ముస్కు రాంరెడ్డి, ముస్కు ప్రదీప్, యారా సంపత్ త ఉన్నారు.

ఈ కార్యక్రమంలో PACS మాజీ చైర్మన్ బిళ్ల సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మూనవత్ నర్సింహ నాయక్, జడ్పిటిసి రంగు కుమార్, ఆరె గూడెం సర్పంచ్ పెండ్లి రజిని సుధాకర్, పార్టీ సీనియర్ నాయకులు మల్లకారి మధు, టీఆర్ఎస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు నర్మద తదితరులు పాల్గొన్నారు.

Read more:

పూర్తిస్థాయిలో టీఎస్ బీపాస్ అమలు.. ఇక నుంచి భవన నిర్మాణాలకు అనుమతులు ఎలా పొందాలంటే..