ఉత్తమ్, భట్టి అరెస్ట్..!

టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరుతూ.. హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోచారంను కలిసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకొని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి , పార్టీ నేత షబ్బీర్‌ అలీ ప్రొటెస్ట్ చేశారు. […]

ఉత్తమ్, భట్టి అరెస్ట్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 06, 2019 | 4:52 PM

టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరుతూ.. హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోచారంను కలిసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకొని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి , పార్టీ నేత షబ్బీర్‌ అలీ ప్రొటెస్ట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటు వేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. గతంలో టీఆర్ఎస్ నేతలతో కలిసినట్టు వచ్చిన క్లిప్పింగ్‌లు, వీడియోలను చూపించినా స్పీకర్ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో.. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి టప్పాచబుత్ర పీఎస్‌కు తరలించారు.