దీదీకి ఇక పీకే వ్యూహమే దిక్కు !
ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ‘ బాధ్యత ‘ మరింత పెరిగింది. ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయానికి, ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ కొత్త సీఎం గా పదవి చేపట్టడానికి మూల కారకుడైన పీకే సేవలు తమకెంతయినా అవసరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆశించారు. ఆమె ఆహ్వానంతో ఆయన గురువారం కోల్ కతాలో సుమారు రెండు గంటలపాటు ఆమెతో భేటీ అయ్యారు. ఇటీవల […]
ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ‘ బాధ్యత ‘ మరింత పెరిగింది. ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయానికి, ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ కొత్త సీఎం గా పదవి చేపట్టడానికి మూల కారకుడైన పీకే సేవలు తమకెంతయినా అవసరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆశించారు. ఆమె ఆహ్వానంతో ఆయన గురువారం కోల్ కతాలో సుమారు రెండు గంటలపాటు ఆమెతో భేటీ అయ్యారు. ఇటీవల బెంగాల్ లో పార్లమెంటరీ ఎన్నికల్లో 42 సీట్లకు గాను తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అంతకుముందు 34 సీట్లున్న ఈ పార్టీ బలం ఇలా పడిపోయింది. అటు బీజేపీ రెండు సీట్ల నుంచి 18 స్థానాలకు తన బలాన్ని పెంచుకోగలిగింది. ఈ పరిణామాలతో డీలా పడిన దీదీ … తన దృష్టిని పీకేపై సారించారు. 2014 లో మోదీ , 2015 లో నితీష్ కుమార్ లను.. పీకే ‘ తోడ్పాటు ‘ తోనే విజయం వరించింది. ఏపీలో జగన్ విజయంతో… ఎన్నో పార్టీలు తమను సంప్రదిస్తున్నాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాగా-2017 లో యూపీలో కాంగ్రెస్ ఓటమితో పీకే కాస్త తెరవెనక్కి వెళ్లారు. కానీ పంజాబ్ లో ఈ పార్టీ విజయం సాధించగలిగింది. ఏమైనా ఆయన ఎన్నికల ప్రచార వ్యూహాలు ప్రధాన పార్టీలకు ఆయువు పట్టులవుతున్నాయి. తన టీమ్ తో పీకే రూపొందిస్తున్న కార్యాచరణను పాటించేందుకు ఈ పార్టీలు తహతహలాడుతున్నాయి. . .