AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Challenge: రాహుల్ ఈత కొట్టారు.. చేపలు పట్టారు.. ఇప్పుడు విద్యార్థులతో పోటీ పడ్డాడు.. ఎందులోనో తెలుసా…!

Rahul: ఈత కొట్టారు.. చేపలు పట్టారు.. ట్రాక్టర్‌ నడిపారు.. తాటి ముంజెలు తింటూ ఫోజులిచ్చారు. డ్యాన్సులు, ఎక్సర్‌సైజులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ..

Rahul Challenge: రాహుల్ ఈత కొట్టారు.. చేపలు పట్టారు.. ఇప్పుడు విద్యార్థులతో పోటీ పడ్డాడు.. ఎందులోనో తెలుసా...!
Sanjay Kasula
|

Updated on: Mar 01, 2021 | 4:59 PM

Share

Rahul Gandhi “Push-Up” Challenge: ఈత కొట్టారు.. చేపలు పట్టారు.. ట్రాక్టర్‌ నడిపారు.. తాటి ముంజెలు తింటూ ఫోజులిచ్చారు. డ్యాన్సులు, ఎక్సర్‌సైజులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా స్టేజీపై సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేశారు. ఏంటి..ఇవన్నీ అనుకుంటున్నారా..? ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గెటప్స్‌. వచ్చే ఎన్నికల్లో పార్టీని అందలమెక్కించేందుకు..పాపం బాగానే కష్టపడుతున్నారు.

ఎలక్షన్స్‌ టైమ్‌లో లీడర్ల వేషాలు ఇంతింత కాదయా అంటారు కదా.. ఎస్‌.. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగడంతో..గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. కేరళ, తమిళనాడుల్లో హోరాహోరీ క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఒకవైపు మోదీ, షాల ద్వయాన్ని రఫ్ఫారిస్తూనే.. మరోవైపు వెరైటీ వేషాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్న రాహుల్ . కన్యాకుమారి జిల్లా ములుగుమూడు ప్రాంతంలోని సెయింట్ జోసఫ్ హైస్కూల్ ను విజట్ చేశారు. స్కూల్‌లో నవయువకుడిలా మారిపోయారు . అక్కడ విద్యార్థులతో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం వారి రిక్వస్ట్ మేరకు వేదికపైనే రాహుల్ మర్షల్ ఆర్ట్స్ ఐకిడో విద్యను ప్రదర్శించారు. సింగిల్ పుషప్స్ కూడా చేశారు.

అయితే గత నెలలో.. తమిళనాడు కన్యాకుమారిలో పర్యటిస్తున్న ఆయన..నాగర్‌కోయిల్‌కు వెళ్తూ తాటి ముంజెలు తింటూ కెమెరాలకు ఫోజులిచ్చారు. కేరళలో పర్యటించిన రాహుల్‌..సముద్రంలో సరదాగా ఈత కొట్టారు. ఇంకాస్త ముందుకెళ్లి చేపలు కూడా పట్టారు.  స్టూడెంట్స్‌కే ఛాలెంజ్‌ విసిరారు. వారితో కలిసి డ్యాన్సులు వేశారు.

ఇక అన్నయ్య తమిళనాడు, కేరళలో పర్యటిస్తుంటే..ఆయన సోదరి..కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకాగాంధీ అసోంపై ఫోకస్‌ పెట్టారు. అక్కడ ఎన్నికల శంఖారావం పూరించారు. ముందుగా గౌహతిలో పర్యటించిన ప్రియాంక..బ్రహ్మపుత్రా నది వద్ద పూజలు చేశారు. కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

SBI Reduced Interest Rate: గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీఐ Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ ఎక్కడ, ఎంత ఉందంటే.. Smriti Irani: స్ట్రీట్ ఫుడ్‌పై కేంద్ర మంత్రి మోజు.. రోడ్డుపై పానీపూరీ తింటూ కనిపించిన స్మృతి ఇరానీ..