Huzurabad by-election: అసలేం జరిగిందో తెలియాలి.. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హై కమాండ్ పోస్ట్ మార్టమ్

Ashok Bhimanapalli, TV9 Reporter Hyderabad : కాంగ్రెస్‌లో హుజురాబాద్ వివాదం మరింత ముదురుతోంది. దారుమైన ఫలితాలు రావడంతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఓటు బ్యాంకుకు చిల్లు పడటంతో ..

Huzurabad by-election: అసలేం జరిగిందో తెలియాలి.. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హై కమాండ్ పోస్ట్ మార్టమ్
Huzurabad Congress

Edited By:

Updated on: Nov 12, 2021 | 2:06 PM

Ashok Bhimanapalli, TV9 Reporter Hyderabad: కాంగ్రెస్‌లో హుజురాబాద్ వివాదం మరింత ముదురుతోంది. దారుమైన ఫలితాలు రావడంతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఓటు బ్యాంకుకు చిల్లు పడటంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. హుజురాబాద్ విషయంలో ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌లో హుజురాబాద్ పోస్ట్ మార్టమ్ స్టార్ట్ అయ్యింది. చాలా ఘోరమైన ఫలితం మూట కట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేపట్టింది. ఇప్పటి వరకు అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ.. హుజురాబాద్ విషయంలో జీర్ణం చేసుకోలేకపోతుంది. అనేక ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయినా.. హుజురాబాద్ విషయంలో మాత్రం సీరియస్ గా తీసుకుంది..హుజురాబాద్ ఫలితం పై రాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్లు సైతం గుర్రుగా ఉన్నారు.

ఈ మధ్య కాలంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేత వీహెచ్ ఈ ఫలితం పై రివ్యూ జరగాలని గట్టి పట్టు పట్టారు. దీంతో మాణిక్కం ఠాగూర్ రివ్యూ చేస్తామన్నారు. అధిష్టానం ఆదేశంతో కర్ణాటక మాజీ ఎమ్మెల్యే నంజన్యన్ మత్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు.

కర్ణాటక కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కమిటీ పని ప్రారంభం కాక ముందే .. రాష్ట్ర నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ముఖ్య నేతలందరినీ రావాలని ఆదేశాలు జారీ చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లు .. ఎన్నికల్లో భాగస్వాయ్యం అయిన నేతలను ఆహ్వానించారు.

అయితే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదట్లో పిలుపు అందినా తర్వాత నిలిపేశారు. మహేశ్వర్ రెడ్డి ప్లేస్ లో ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. హుజురాబాద్ పోస్ట్ మార్టమ్ ద్వారా కాంగ్రెస్ మెరుగు పడేనా.. షరా మామూలేనా అనేది వేచి చూడాలి.

అశోక్ భీమనపల్లి, టీవీ9 

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..