AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళా సంఘాలకు రైస్ మిల్లులు అప్పగించండి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేయడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బకాయిల వసూళ్లకు సమగ్ర విధానాన్ని రూపొందించి, కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం స్పష్టం చేశారు.

మహిళా సంఘాలకు రైస్ మిల్లులు అప్పగించండి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Cm Revanth Reddy, Uttam Kumar Reddy
Balaraju Goud
|

Updated on: Aug 12, 2026 | 4:11 PM

Share

డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేయడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బకాయిల వసూళ్లకు సమగ్ర విధానాన్ని రూపొందించి, కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సివిల్ సప్లయిస్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వెంటనే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకుని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఐదు నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో గోడౌన్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ధాన్యం అధికంగా దిగుబడి అయ్యే ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేయాలని, గోడౌన్ల నిర్మాణానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించి పర్యవేక్షణను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us