తెలంగాణ బడ్జెట్ సమావేశౄలు మూడో రోజు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య వాదోపవాదలు జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి మాట్లాడారు. వ్యవసాయ రంగం గురించి తమిళిసై చాలా గొప్పగా చెప్పారని భట్టి అన్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అసెంబ్లీలో భట్టి డిమాండ్ చేశారు. ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని, వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు.
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఉప సభాపతిగా కూడా పని చేశారని, సభా నిబంధనలు ఆయనకు బాగా తెలుసని సీఎం కేసీఆర్ అన్నారు. తాము వ్యవసాయ చట్టాలపై చెప్పాల్సింది గతంలోనే చెప్పామని కేసీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మంచిదని చురకంటించారు.
నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో వచ్చే విషయాలను అక్కడ మాట్లాడితేనే మంచిదని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలనే అసెంబ్లీలో ప్రస్తావించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని సీఎం అన్నారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.
అదనపు సమయం కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క స్పీకర్ మీద ఒత్తిడి తేవడం సరికాదన్నారు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. భట్టి విక్రమార్క కూడా ఉపసభాపతిగా పని చేశారు. భట్టికి కేటాయించిన సమయం కంటే మూడింతలు సమయం వాడుకున్నారు. స్పీకర్ పట్ల కాంగ్రెస్ నేతలు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ సజావుగా సాగాలంటే స్పీకర్ ఒత్తిడికి లోనయి ఇంకా అదనపు సమయం ఇవ్వడం సరి కాదు. సభలో అందరి హక్కులు కాపాడాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడాలనుకుంటే బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లు సమయంలో మాట్లాడ వచ్చు. సభను హైజాక్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూడటం సరికాదన్నారు మంత్రి హరీశ్‌రావు. స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కోమటి రెడ్డి రాజగోపాల్ , భట్టి విక్రమార్క స్పీకర్ కు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి హరీశ్‌రావు.
Read More:
ఏపీలో ఆ సంచలన నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర.. ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన బీబీ హరిచందన్