జాతకాలు విప్పితే తలెత్తుకోలేరు

| Edited By:

Oct 18, 2020 | 7:38 PM

విభజన హామీలపై రాష్ట్రపతి కోవింద్ ను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ పాదయాత్రగా సీఎం చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఆ పార్టీ నేతలు కూడా ర్యాలీగా వెళ్లారు. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో రాష్ట్రానికి ప్రధాని మోడీ ఇచ్చిన హామీల లిస్ట్ ను పొందుపరిచారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. మేము న్యాయం కోసం పోరాటాలు చేస్తుంటే మాపై మీరు జోకులు […]

జాతకాలు విప్పితే తలెత్తుకోలేరు
Follow us on

విభజన హామీలపై రాష్ట్రపతి కోవింద్ ను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ పాదయాత్రగా సీఎం చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఆ పార్టీ నేతలు కూడా ర్యాలీగా వెళ్లారు. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో రాష్ట్రానికి ప్రధాని మోడీ ఇచ్చిన హామీల లిస్ట్ ను పొందుపరిచారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. మేము న్యాయం కోసం పోరాటాలు చేస్తుంటే మాపై మీరు జోకులు వేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్కరి జాతకాలు విప్పితే మళ్లీ వాళ్లు తలెత్తుకోలేరని హెచ్చరించారు. దేశంపై చిత్తశుద్ధి లేదని, అభివృద్ధి చేయాలనే ఆశయం కూడా మోడీకి లేదని అన్నారు. ప్రధాని మోడీకి ఏపీపై చిత్తశుద్ధి లేదని ఉంటే టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేవారు అని ప్రశ్నించారు. ప్రధాని న్యాయం చేయలేదనే రాష్ట్రపతిని ఆశ్రయించామని, ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే.. కోర్టుకు వెళ్తానని అన్నారు.