ప్లీజ్.. పిల్లల్ని కనండి.. బుజ్జగిస్తున్న నేతలు.. కారణమేంటి ??

|

Jan 21, 2025 | 7:06 PM

"ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దు అని మేమే చెప్పాం. కానీ..ఇప్పుడు మేమే ఓ రిక్వెస్ట్ చేస్తున్నాం. వీలైనంత వరకూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి. అలా అయితేనే మనం నంబర్ వన్ అవుతాం". స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఇవి. ఒక్కసారి కాదు. చాలా సందర్భాల్లో ఈ మాట చెబుతూనే ఉన్నారాయన.

ప్లీజ్.. పిల్లల్ని కనండి.. బుజ్జగిస్తున్న నేతలు.. కారణమేంటి ??
Population Increase
Follow us on

ఇండియాలో యంగ్ పాపులేషన్ తగ్గిపోతోందని, తద్వారా ప్రొడక్టివిటీ పడిపోతుందన్నది ఆయన చెప్పిన మాటల్లోని సారాంశం. ఏపీలోని చాలా గ్రామాల్లో యువ జనాభా తగ్గిపోతోందని వివరించారు చంద్రబాబు. అందుకే…పిల్లల్ని కనాలంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతే కాదు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఇన్సెంటివ్స్‌ ఇస్తామని కూడా చెప్పారు. రీసెంట్‌గా మరోసారి ఇదే ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన..కీలక స్టేట్‌మెంట్ ఇచ్చారు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఇకపై పోటీ చేయాలంటే..ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్లనే అర్హులుగా కన్సిడర్ చేస్తామని ప్రతిపాదన తీసుకొచ్చారు. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉన్న సీఎం చంద్రబాబు..ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసే అవకాశముంది.

నిజానికి చంద్రబాబు మాత్రమే కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ కూడా గతంలో ఓసారి ఇవే కామెంట్స్ చేశారు. పైగా..ఒక్కొక్కరూ 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు అంటూ జోక్‌లు కూడా వేశారు. అయితే..దీని వెనకాల ఓ పొలిటికల్ రీజన్‌ ఉంది. ఎక్కువ మంది జనాభా ఉంటే..ఆ మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. కేంద్రంలో రాష్ట్రానికి వెయిటేజ్ కూడా పెరుగుతుంది. కారణాలు వేరైనా…ఈ ఇద్దరూ చెప్పిన పాయింట్ ఒకటే. ప్రస్తుతం భారత్ జనాభా చైనా పాపులేషన్‌ని దాటేసింది. అసలు ఈ జనాభా పెరుగుదల వల్లే భారత్‌లో సరిగ్గా అభివృద్ధి జరగలేదన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. మన దేశ జనాభా కారణంగానే…అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని..రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై ఫోకస్ చేయాలని సూచించారు మోదీ. కానీ..ఇదే సమయంలో కొంత మంది పొలిటీషియన్స్..యువ జనాభా తగ్గిపోతోందని, పిల్లల్లి కనమని అంటున్నారు. ఇలా రెండు వాదనలు వినిపిస్తున్నాయి.

1970 వరకూ భారత్‌లో ఒక్కో మహిళ తమ జీవితకాలంలో కనీస ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆ తరవాత ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2022 నాటికి ఈ బర్త్ రేట్ 2 కి పడిపోయింది. అంటే..మహిళలు ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు. ఆ తరవాత ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఐరోపా దేశాల్లో ఈ బర్త్‌ రేట్ పడిపోవడానికి దాదాపు 200 ఏళ్లు పట్టింది. కానీ..ఇండియాలో మాత్రం ఈ మార్పు కేవలం 45 సంవత్సరాల్లోనే జరిగిపోయింది. అంటే..అంత వేగంగా బర్త్‌రేట్ తగ్గుతూ వచ్చింది. అయితే..ఇదే సమయంలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. అంటే..పని చేసే వాళ్ల కన్నా..వాళ్లపై ఆధారపడుతున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఇండియా మొత్తం ఇదే పరిస్థితి ఉన్నా…దక్షిణాదిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బర్త్‌రేట్‌..నేషనల్ యావరేజ్ కన్నా తక్కువగా ఉంటోంది. అందుకే…ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు..తమిళనాడు సీఎం ఎమ్‌కే స్టాలిన్‌ అంతగా ఈ సమస్య గురించి ప్రస్తావిస్తున్నారు. ఇతర వివరాల కోసం ఫుల్ వీడియోను చూడండి..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Virat Kohli: రూ.34 కోట్లతో కోహ్లీ కొత్త ఇల్లు.. హాలిడే హోమ్ కోసం ఇంత ఖర్చా ??

ట్రంప్ పలుకే “బంగారం” పెరిగినా..తగ్గినా.. అంతా ఆయన చేతుల్లోనే

Sunita Williams: సునీతా విలియమ్స్‌ స్పేస్‌వాక్‌ చూశారా ??

నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్‌పై వచ్చి కాల్పులు

H-1B Visa: అమెరికన్‌ ఉద్యోగులకు H1B ముప్పు