ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టులో పీవీప్యాట్ లెక్కింపు కేసు విచారణ జరగనుండగా.. ఆ విచారణకు హాజరుకావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈవీఎంలు సహా 50శాతం పీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని చంద్రబాబు సహా 21 రాజకీయ పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ విచారణకు స్వయంగా హాజరుకావాలని పిటిషనర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఢిల్లీకి పయనం కానున్నారు. సుప్రీంకోర్టులో విచరాణ అనంతరం ఎన్డీయే వ్యతిరేక కూటమి నేతలతో చంద్రబాబు […]

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టులో పీవీప్యాట్ లెక్కింపు కేసు విచారణ జరగనుండగా.. ఆ విచారణకు హాజరుకావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈవీఎంలు సహా 50శాతం పీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని చంద్రబాబు సహా 21 రాజకీయ పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ విచారణకు స్వయంగా హాజరుకావాలని పిటిషనర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఢిల్లీకి పయనం కానున్నారు. సుప్రీంకోర్టులో విచరాణ అనంతరం ఎన్డీయే వ్యతిరేక కూటమి నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యే అవకాశం ఉంది.



