బెంగాల్ ఎన్నికలు, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి నామినేషన్ ని రద్దు చేయాలంటూ టీఎంసీ డిమాండ్, ఈసీకి లేఖ

| Edited By: Phani CH

Mar 17, 2021 | 7:20 PM

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి  సువెందు అధికారి నామినేషన్ ని రద్దు చేయాలని  తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ పార్టీ ఈసీకి లేఖ రాసింది.

బెంగాల్ ఎన్నికలు, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి నామినేషన్ ని రద్దు చేయాలంటూ టీఎంసీ డిమాండ్, ఈసీకి లేఖ
Suvendu Adhikari
Follow us on

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి  సువెందు అధికారి నామినేషన్ ని రద్దు చేయాలని  తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ పార్టీ ఈసీకి లేఖ రాసింది. నందిగ్రామ్ నుంచి ఆయన ఓటర్ స్టేటస్ ను రద్దు చేయాలని,  ఇక్కడ నివసించకుండానే ఆయన తప్పుడు నివాస పత్రాలు సమర్పించారని టీఎంసీ ఆరోపించింది.  ఈ కారణంగా నందిగ్రామ్ నుంచి ఆయన నామినేషన్ చట్టరీత్యా అక్రమమని తెలిపింది.   హల్దియాలో కూడా అధికారికి ఓటర్ ఐడీ ఉంది.  శాశ్వత నివాసి అయినప్పటికీ గత ఆరు నెలలుగా ఆయన నందిగ్రామ్ లోని నందనాయకబార్ గ్రామంలో నివసించడంలేదు.. అలాంటప్పుడు ఆయన నందిగ్రామ్ అభ్యర్థి ఎలా అవుతారు అని ఈ పార్టీ ప్రశ్నించింది. హల్దియా ఓటర్ల జాబితా నుంచి తన పేరును  నందిగ్రామ్ కి మార్చాలని అయన కోరారని,  పైగా  తప్పుడు పత్రాలు సమర్పించారని తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాగా- సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన నామినేషన్ పత్రాల్లో తనపై గల 6 క్రిమినల్ కేసుల విషయాన్ని ప్రస్తావించకుండా దాచి పెట్టారని, అందువల్ల ఆమె నామినేషన్ ని రద్దు చేయాలని సువెందు అధికారి ఇదివరకే ఈసీని కోరారు. ఆ కేసులను పరిశీలించాలని విన్నవించారు.

ఇక టీఎంసీ సమర్పించిన లేఖను  కూడా ఈసీ పరిశీలించాల్సి  ఉంది. ఇప్పుడు సువెందు అధికారి నందిగ్రామ్ నివాసి అవునా, కాదా అన్న విషయాన్నీ తేల్చడంతో బాటు మమతా బెనర్జీ ఆ కేసుల విషయాన్ని ఎందుకు తొక్కి పెట్టారన్న అంశం మీదా ఈ సంస్థ ఫోకస్ పెట్టనుంది.

 

మరిన్ని ఇక్కడ చదవండి: Snakes Hulchal: తిరుమలలో పాముల కలకలం.. భక్తులు హడల్.. మహాబూబ్‌నగర్ జిల్లాలో అయితే కుప్పలు తెప్పలుగా

బండి సంజయ్‌ను అడ్డుకున్న స్వేరోస్‌.. ప్రవీణ్‌కుమార్‌కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌