టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న బైరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య

రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరికాసేపట్లో ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య కూడా పసుపు కండువాను కప్పుకోనున్నారు. గత ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి విజయం సాధించిన ఐజయ్యకు ఈ సారి వైసీపీ అధినేత జగన్‌ నుంచి చుక్కెదురైంది. నందికొట్కూరు టికెట్‌ను తనకు కాదని అర్ధర్‌కు కేటాయించడంతో మనస్తాపానికి గురైన […]

టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న బైరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య

Edited By:

Updated on: Mar 20, 2019 | 6:05 PM

రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరికాసేపట్లో ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య కూడా పసుపు కండువాను కప్పుకోనున్నారు.

గత ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి విజయం సాధించిన ఐజయ్యకు ఈ సారి వైసీపీ అధినేత జగన్‌ నుంచి చుక్కెదురైంది. నందికొట్కూరు టికెట్‌ను తనకు కాదని అర్ధర్‌కు కేటాయించడంతో మనస్తాపానికి గురైన ఐజయ్య పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో బైరెడ్డితో కలిసి నేడు టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. అయితే నందికొట్కూరు టికెట్‌ను ఇప్పటికే బండి జయరాజుకు కేటాయించడంతో ఐజయ్య పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.