Suvendu Adhikari Nomination: ఉత్కంఠగా మారిన నందిగ్రామ్ ఫైట్.. దీదీకి పోటీగా సువేందు అధికారి నామినేషన్‌..

|

Mar 12, 2021 | 1:42 PM

బెంగాల్‌లో నందిగ్రామ్‌ ఫైట్‌ ఉత్కంఠ రేపుతోంది. 293 నియోజకవర్గాలు ఒక ఎత్తైతే.. ఈ నందిగ్రామ్‌ ఒక్కటే ఒక ఎత్తు. అక్కడ పోటీ పడుతున్న ఇద్దరూ ఇద్దరే.. ఒకరేమో..

Suvendu Adhikari Nomination: ఉత్కంఠగా మారిన నందిగ్రామ్ ఫైట్.. దీదీకి పోటీగా సువేందు అధికారి నామినేషన్‌..
Suvendu Adhikari Nomination
Follow us on

బెంగాల్‌లో నందిగ్రామ్‌ ఫైట్‌ ఉత్కంఠ రేపుతోంది. 293 నియోజకవర్గాలు ఒక ఎత్తైతే.. ఈ నందిగ్రామ్‌ ఒక్కటే ఒక ఎత్తు. అక్కడ పోటీ పడుతున్న ఇద్దరూ ఇద్దరే.. ఒకరేమో ఆ రాష్ట్రానికే ముఖ్యమంత్రి.. మరొకరేమో.. దశాబ్ధాలుగా ఆ ప్రాంతంలో మంచి పట్టున్న నేత . పైగా టీఎంసీలో సీఎం మమత తర్వాత.. నంబర్‌ టు ప్లేస్‌లో చాలా కాలం కొనసాగిన  సువేందు అధికారి. ఈ ఇద్దరూ నందిగ్రామ్‌ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఎలాగైనా గెలిచి తీరాలి. ఇదే టార్గెట్‌. దీంతో ఇటు సీఎం మమత.. అటు సువేందు అధికారి నువ్వా..నేనా అన్నట్లుగా పోరాడుతున్నారు.

ఇక నందిగ్రామ్‌ నుంచి నామినేషన్‌ వేశారు సువేందు అధికారి. బీజేపీ అభ్యర్థిగా ఆయన తన నామినేషన్‌ దాఖలు చేశానే. అంతకుముందు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, దర్మేంద్ర ప్రదాన్‌, మిథున్‌ చక్రవర్తి హాజరయ్యారు.

నందిగ్రామ్‌లో స్థానికులతో మమేకమయ్యారు సువేందు అధికారి. అక్కడి ప్రజలతో తనకున్న అనుబంధం.. ఈనాటిది కాదని.. ఎప్పటినుంచో ఉందన్నారు. మమతా బెనర్జీ ఐదేళ్లకోసారి మాత్రమే వస్తారని ఆరోపించారు. బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. బెంగాల్‌ ప్రజలు బీజేపీతోనే ఉంటారని నమ్మకంతో ఉన్నామన్నారు. భారీ మెజార్టీతో బెంగాల్‌ కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని సవాల్‌ విసిరారు. దీంతో అక్కడి పోటీ రసవత్తరంగా మారింది.

ఇక ఇప్పటికే నందిగ్రామ్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు సీఎం మమతాబెనర్జీ… తాను ఎప్పుడూ పోటీ చేసే భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు మమత. ఇన్నాళ్లూ టీఎంసీలో ఉండి తనకు హ్యాండిచ్చిన సువేందు అధికారిపై ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

నందిగ్రామ్‌లో నామినేషన్‌ సందర్బంగా గాయపడిన మమత హాస్పిటల్‌లో కోలుకుంటున్నారు. కాలికి ఫ్రాక్చర్‌ అవడంతో..48గంటలపాటు తమ పరిశీలనలో ఉంచారు డాక్టర్లు. ఐతే తన ప్రచార షెడ్యూల్‌లో మాత్రం..మార్పు లేదని ప్రకటించారు మమత. వీల్‌ ఛైర్‌ నుంచైనా క్యాంపెయినా నిర్వహిస్తానని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

Katas Raj Temple in Pakistan: పాకిస్తాన్‌లో పరమశివుడి ఆలయం.. దాయాది దేశంలో విరాజిల్లుతున్న భోళాశంకరుడు