BJP-Yuva Telangna: బండి సంజయ్ వ్యూహాత్మక అడుగులు.. జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీలో చేరికకు డేట్ ఫిక్స్..

తెలంగాణలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. రాష్ట్రంలో బలపడేందుకు వివిధ పార్టీల నాయకులను ఆకర్షించే పనిలో పడింది. గులాబీ పార్టీకి వ్యతిరేకించే శక్తులను కలుపుకుని ముందుకు..

BJP-Yuva Telangna: బండి సంజయ్ వ్యూహాత్మక అడుగులు.. జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీలో చేరికకు డేట్ ఫిక్స్..
Yuva Telangana Bjp Bandi Sanjay

Updated on: Feb 07, 2022 | 7:30 PM

తెలంగాణలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ(BJP). రాష్ట్రంలో బలపడేందుకు వివిధ పార్టీల నాయకులను ఆకర్షించే పనిలో పడింది. గులాబీ పార్టీ(TRS)కి వ్యతిరేకించే శక్తులను కలుపుకుని ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. సొంత కుంపటి పెట్టిన వాళ్ళను కూడా దగ్గరకు చేర్చుకోవాలని అనుకుంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని యువ తెలంగాణ పార్టీ(YUVA TELANGANA).. భారతీయ జనతా పార్టీ(BJP)లో విలీనం చేసేందుకు అడుగులు పడుతున్నాయి.  తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్‌, బీజేపీలు ఒత్తిడి తీసుకురాగా.. జిట్టా బాలకృష్ణా రెడ్డి మాత్రం  బీజేపీ వైపే మొగ్గు చేపారు.

యువ తెలంగాణ పార్టీ విలీనానికి అంగీకారం తెలుపుతూ బీజేపీ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే ఓ సారి లేఖ రాసిన సంగతి తెలిసిందే. జిట్టాతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రాణీరుద్రమ సైతం కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 16న యువ తెలంగాణ పార్టీ విలీనం ఉంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ప్రకటించారు.

అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఈ నెల 16న జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణీరుద్రమ సహా కీలక నేతలతో కాషాయ కండువా కప్పుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణారెడ్డి భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌ ఆశిస్తుండగా… ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అసెంబ్లీ టికెట్‌ కోరుతున్నట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి: CM KCR Yadadri visit: శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య పరిశీలన..