GVL Narasimha rao: ఆర్థిక మంత్రా.. అప్పుల మంత్రా.. బుగ్గనాపై ఎంపీ జీవీఎల్ సంచలన కామెంట్స్..

ఏపీ ప్రభుత్వ విధానాలపై సంచలన కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఏపీలో ఆర్ధిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనా రాజేంద్రనాథ్..

GVL Narasimha rao: ఆర్థిక మంత్రా.. అప్పుల మంత్రా.. బుగ్గనాపై ఎంపీ జీవీఎల్ సంచలన కామెంట్స్..
G. V. L. Narasimha Rao

Updated on: Jul 25, 2021 | 2:25 PM

ఏపీ ఆర్ధిక మంత్రి విధానాలపై సంచలన కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఏపీలో ఆర్ధిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనా రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుల మంత్రిగా పనిచేస్తున్నట్టు ఆరోపించారు. అప్పుల కోసమే ప్రత్యేకంగా స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. విచ్చలవిడి అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారాయన. ఆర్బీఐ, కాగ్‌ స్పెషల్‌ ఆడిట్‌ చేసి లోతుగా విచారణ జరపాలని కోరతామన్నారు. అప్పుల విషయాన్ని పార్లమెంట్‌లో కూడా ప్రస్తావిస్తామన్నారు జీవీఎల్.

ఎన్నికల హామీల అమలు కోసం అప్పులు చేయడం సరికాదన్నది జీవీఎల్ వాదన. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. వనరులు సమీకరించి పథకాలు అమలు చేయాలే తప్ప అప్పులు చేసి కాదన్నారు జీవీఎల్.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Bonala Jatara: బోనమెత్తిన ఉజ్జయిని.. బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని

Bigg Boss Fame Yashika: చెన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషికకు తీవ్ర గాయాలు..