రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై వైసీపీ నేతలు విరుచుకుపడుతుండటంతో తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తనదైన తరహాలో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలపై జీవీఎల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్నవారు విమర్శలను తట్టుకునే సహనం, ఓపిక ఉండాలని హితువు పలికారు. నువ్వు ఒకటంటే నేను వంద అంటాననే పద్దతి, అహంకారం రాజకీయాల్లో సరికాదని.. ఇలా నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం అని విమర్శించారు.
‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారిపై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నాను. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలి. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలి’ అని జీవీఎల్ నరసింహారావు సూచించారు.
జనసేన అధ్యక్షులు @PawanKalyan గారిపై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నాను. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలి. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం. తిట్ల తుఫానుకు తెరదించి గులాబ్ తుఫానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలి.
— GVL Narasimha Rao (@GVLNRAO) September 28, 2021
ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు పేర్ని నాని క్షమాపణ చెప్పాలన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రిని పిలిచి సంజాయిషీ అడగాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు విన్నవించే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి జుగుప్సాకరమైన విమర్శలు చేశారని అవి తప్పుడు మంత్రిని పోత్సహించేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మంత్రి పేర్ని నాని ఉద్దేశ్యపూర్వకంగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బద్వేలు ఎన్నికపై మిత్రపక్షమైన జనసేనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సోము వీర్రాజు. బద్వేలు ఎన్నికపై మిత్రపక్షమైన జనసేన తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సోము వీర్రాజు.
ఇవి కూడా చదవండి: Vitamin D Deficiency: మీలో విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక గుర్తిస్తుంది.. ఎలానో తెలుసా..