బద్వేల్ బరిలో నిలవబోతున్న బీజేపీ అభ్యర్థి ఎవరు?.. ప్రస్తుతానికి ఐదుగురు పేర్లతో రాష్ట్ర నాయకత్వం ఓ లిస్ట్‌ను అధిష్టానానికి పంపింది. అయితే మాజీ ఎమ్మెల్యే జయరాములు, సురేష్ పేర్లు హైలైట్ అవుతున్నాయి. నామినేషన్స్ ముగింపునకు టైమ్ దగ్గరపడ్డంతో హైకమాండ్ నుంచి రిటర్న్ రిప్లై కోసం రాష్ట్ర నాయకత్వం ఎదురుచూస్తోంది. మరోవైపు టికెట్ ఎవరికి ఇచ్చినా.. సహకరించుకునేలా అందర్నీ కలుపుకొనే ప్రయత్నం చేస్తారు సోము వీర్రాజు. అందుకే కాసేపట్లో రాయలసీమ నేతలతో సమావేశం పెట్టుకోబోతున్నారు. జనసేన పోటీలో లేకపోవడంతో బీజేపీకి ఆ పార్టీ మద్దతుపైనా చర్చలు జరగబోతున్నాయి.
పవన్ ప్రచారంపై..
బద్వేల్ ఉప ఎన్నికలో పోటీకి దిగిన బీజేపీకి జనసేన నాయకుడు పవన్ ప్రచారం చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. బద్వేల్ ఉప ఎన్నిక నుంచి జనసేన తప్పుకున్న సంగతి తెలిసిందే. సాంప్రదాయాలను పాటించి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అయితే, మిత్రపక్షం బీజేపీ మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తోంది. గతంలో తిరుపతి లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపి ప్రచారం చేశారు. అయితే, ఇప్పుడు బద్వేల్ ఉపఎన్నికకు జనసేన దూరం కావడంతో.. బీజేపీ పోటీకి దిగింది.
ప్రచారంలో వైసీపీ దూకుడు
ఇటు ప్రత్యర్థి వైసీపీ కూడా ప్రచారంలో దూసుకుపోతున్న అధికార వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా. మండలాల వారీగా వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న ఎంపీ వై ఎస్ అవినాష్.
డాక్టర్ వెంకట సుబ్బయ్య..
ఇక, 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆనారోగ్యంతో చనిపోవడంతో ఇక్కడ బైపోల్ జరుగుతోంది. సుబ్బయ్య భార్య సుధకే టికెట్ కేటాయించింది వైసీపీ. చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చారు కాబట్టి..ఆనవాయితీ ప్రకారం పోటీలోంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ, జనసేన ఇప్పటికే ప్రకటించాయి. బద్వేల్ ఉప ఎన్నిక 30న జరగనుంది. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Powerball Winner: ఒకే ఒక్కడు విజేత.. ఐదువేలు కోట్ల లాటరీ గెలిచాడు.. రాత్రికి రాత్రి కుబేరుడయ్యాడు..
Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..