AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విభజన సమయంలో ఎన్నో హామీలు.. పెండింగులో బోలెడు

సమైక్య (ఉమ్మడి) ఏపీని తెలంగాణ, ఏపీలుగా విభజించేటప్పుడు కేంద్రం ఎన్నో హామీలిచ్చింది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో నాటి కేంద్ర ప్రభుత్వం బై-ఫర్కేషన్ ప్యాకేజీని ప్రకటించిన సందర్భమది ! ఏపీ పునర్విభజన చట్టం-2014 లో ఈ హామీలను చేర్చారు. చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ హామీల్లో కొన్నింటిని మాత్రమే కేంద్రం నెరవేర్చగా.. ఇంకా మరికొన్ని పెండింగులోనే..కాగితాల పైనే ఉన్నాయి. రాజ్యాంగ పరమైన చిక్కుల కారణంగా వీటిలో కొన్ని తక్షణ అమలుకు నోచుకోలేకపోయాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో […]

విభజన సమయంలో ఎన్నో హామీలు.. పెండింగులో బోలెడు
Anil kumar poka
|

Updated on: May 31, 2019 | 4:09 PM

Share

సమైక్య (ఉమ్మడి) ఏపీని తెలంగాణ, ఏపీలుగా విభజించేటప్పుడు కేంద్రం ఎన్నో హామీలిచ్చింది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో నాటి కేంద్ర ప్రభుత్వం బై-ఫర్కేషన్ ప్యాకేజీని ప్రకటించిన సందర్భమది ! ఏపీ పునర్విభజన చట్టం-2014 లో ఈ హామీలను చేర్చారు. చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ హామీల్లో కొన్నింటిని మాత్రమే కేంద్రం నెరవేర్చగా.. ఇంకా మరికొన్ని పెండింగులోనే..కాగితాల పైనే ఉన్నాయి. రాజ్యాంగ పరమైన చిక్కుల కారణంగా వీటిలో కొన్ని తక్షణ అమలుకు నోచుకోలేకపోయాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో వెల్లువెత్తిన హామీలతో పోలిస్తే..నాటి వాగ్దానాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన హామీలు పెండింగులో ఉన్నట్టు తేలింది. వీటిలో మచ్ఛుకు కొన్ని.. ఏపీకి ప్రత్యేక హోదా.. విజయవాడ-విశాఖలకు మెట్రో రైలు… అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225 కు పెంపు… ఏఐఐఎంఎస్, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం, ఏపీ హైకోర్టు, కొత్త రాజధాని అభివృద్ది, గ్రేహౌండ్స్ ట్రెయినింగ్ సెంటర్, రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ , దుర్గరాజపట్నం లో సీపోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు పెట్రోలియం కారిడార్, విజయవాడ-విశాఖ-తిరుపతిలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, విశాఖ హెడ్ క్వార్టర్ గా రైల్వే జోన్, రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానం. పోలవరం ప్రాజెక్టు… ఇలా ఎన్నో ఉన్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఏపీకి కేంద్రం నుంచి ఇంకా రూ. 4,063 కోట్ల నిధులు అందాల్సి ఉంది. ఏపీ 16 వేల కోట్ల రెవెన్యూ నష్టంలో ఉందని నాటి ప్రభుత్వం చెబితే కేంద్రం రూ. 3,979 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. కడప స్టీల్ ప్లాంటుకు నిధుల విషయంలో మొండిచెయ్యి చూపింది. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 2014 జూన్ నుంచి 15 వేల కోట్లు విడుదల చేసింది. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాల అభివృధ్దికి రూ. 1050 కోట్లు విడుదలయ్యాయి. అయితే రూ. 350 కోట్లను కేంద్రం మళ్ళీ వెనక్కి తీసుకుందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. కేంద్ర సంస్థలకు సంబంధించి ఏపీకి ఇంకా రూ. 12,825 కోట్లు అందాల్సి ఉంది. ఇందులో 895 కోట్లు మాత్రమే మంజూరైంది. దుర్గరాజపట్నంవద్ద సీపోర్టు మొదటి దశ నిర్మాణం 2018 నాటికే పూర్తి కావలసి ఉంది. ఇంకా పనులు చేపట్టలేదు. విశాఖ- చెన్నై కారిడార్ ప్రాజెక్టు పని ప్రారంభం కాలేదు. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ కు కేంద్రం రూ. 17,500 కోట్లు మంజూరు చేసినా.. వైజాగ్-చెన్నై కారిడార్ నిర్మాణానికి నిధులు విడుదల చేయలేదని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. విజయవాడ-విశాఖ మెట్రో రైలు తో బాటు అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన హామీలు అలాగే ఉన్నాయి. ఇక అసెంబ్లీ సీట్ల పెంపు హామీ విషయమూ అంతే ! కానీ-విశాఖ రైల్వే జోన్ విషయంలో ఇఛ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినప్పటికీ వాల్తేరు డివిజన్ ని పక్కన బెట్టారు.కాగా- ఐఐఎం, ఐఐటీ, ఇతర కేంద్ర సంస్థలు పని చేయడం ప్రారంభించాయి. అలాగే ఏపీ హైకోర్టు కూడా.. తాను ఢిల్లీని 29 సార్లు విజిట్ చేసి కేంద్రం నాడు ఇఛ్చిన హామీలను అమలు చేయాలని కోరినప్పటికీ.. ఫలితం లేకపోయిందని మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చాలాసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీ అధినేత జగన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంలో కేంద్రం నుంచి వఛ్చిన ఈ హామీలు, పెండింగు వాగ్దానాలను ఓ వ్యాసకర్త గుర్తు చేస్తూ ఓ డైలీలో వీటిని ప్రస్తావించారు.