
Balayya Hindupur tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరానని, ఈ మేరకు లెటర్ రాశానని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురం అభివృద్ధిపై ఆయనతో చర్చిస్తానని తెలిపారు. తన నియోజకవర్గంలో బాలయ్య పర్యటించారు. ఈ సందర్భంగా హిందూపురం ప్రభుత్వాసుపత్రికి రూ.55లక్షల విలువైన నివారణ ఔషధాలు, పరికరాలు అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి సన్నగిల్లిందని, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని విమర్శించారు. తాను ఎక్కడున్నా నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తామని తెలిపారు. రాజధాని లేకున్నా టీడీపీ హయంలో తెలంగాణ కన్నా ఏపీకి ఆదాయం ఎక్కువగా వచ్చిందని బాలయ్య దుయ్యారబట్టారు. కాగా ఏపీలో త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హిందూపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Read More: