బాలయ్య నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి హిందూపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు నటుడు నందమూరి బాలకృష్ణ. టీడీపీ తరఫున రెండోసారి హిందూపురం నుంచి బాలయ్య పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 22న బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని పీఆర్వో వంశీ కాక సోషల్ మీడియాలో వెల్లడించారు. మరోవైపు బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేసే సమయంలో హిందూపురంలో భారీ ర్యాలీ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు […]

బాలయ్య నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 18, 2019 | 11:39 AM

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి హిందూపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు నటుడు నందమూరి బాలకృష్ణ. టీడీపీ తరఫున రెండోసారి హిందూపురం నుంచి బాలయ్య పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 22న బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని పీఆర్వో వంశీ కాక సోషల్ మీడియాలో వెల్లడించారు. మరోవైపు బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేసే సమయంలో హిందూపురంలో భారీ ర్యాలీ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు.