గవర్నర్‌ను కలిసిన స్పీకర్ కోడెల..!

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏపీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలపై గవర్నర్ తో కోడెల చర్చించారని తెలుస్తోంది. ఇక ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కోడెల.. ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ ను కలిసినట్లు తెలిపారు. ఏపీలో అధికారపక్షానికి గవర్నర్ పూర్తిగా సహకరించారని కితాబిచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన సమయంలో ఘర్షణలు ఎక్కువగా […]

గవర్నర్‌ను కలిసిన స్పీకర్ కోడెల..!

Edited By:

Updated on: Apr 20, 2019 | 6:11 PM

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏపీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలపై గవర్నర్ తో కోడెల చర్చించారని తెలుస్తోంది. ఇక ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కోడెల.. ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ ను కలిసినట్లు తెలిపారు. ఏపీలో అధికారపక్షానికి గవర్నర్ పూర్తిగా సహకరించారని కితాబిచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన సమయంలో ఘర్షణలు ఎక్కువగా చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో పోలీసు సిబ్బంది బాగా తక్కువ ఉన్నారని కోడెల తెలిపారు.