బెట్టింగ్‌ సైట్స్, యాప్‌లను తొలగించండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ

రాష్ట్రంలో యువత జీవితాలతో చెలగాటమాడుతున్న ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.

బెట్టింగ్‌ సైట్స్, యాప్‌లను తొలగించండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ

Updated on: Oct 29, 2020 | 6:26 AM

రాష్ట్రంలో యువత జీవితాలతో చెలగాటమాడుతున్న ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా ప్రజలు బానిసలవుతున్నారని, వీటిని వెంటనే నిషేధించాలని కోరారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌కు కారణమవుతున్నాయని.. వాటిని నిషేధించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బెట్టింగ్‌, గాంబ్లింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లకు ముఖ్యంగా యువత ఆర్థికంగా చితకిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1974 ఏపీ గేమింగ్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో సీఎం జగన్ గుర్తించారు. ఆ చట్టం ద్వారా నిందితులను కఠినంగా శిక్షించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. యువతకు బంగారు భవిత నిర్మాణానికి సహాకరించాలని సీఎం జగన్ కోరారు.