AP Government lands sale in Visakhapatnam : ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యుటివ్ రాజధాని విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్ వేసింది. విశాఖలో ఐదు చోట్ల భూములు అమ్మడానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఇవాళ స్టే ఇచ్చింది. గతంలో ‘బిల్డ్ ఏపీ’ పేరున ఇలానే అమ్మకాలుకు ప్రయత్నించగా కోర్టు స్టే ఇచిందన్న పిటిషనర్ వాదననను సమర్థించిన హైకోర్టు.. ఇదే ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికి వర్తిస్తాయని వెల్లడించింది. భూముల అమ్మకాల ప్రక్రియకు సంబంధించి టెండర్లు ఫైనలైజ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఉండగా, ‘మిషన్ బిల్డ్ ఏపీ’ లో భాగంగా విశాఖలో ఖరీదైన స్థలాలను జగన్ సర్కారు అమ్మకానికి పెట్టింది. ప్రభుత్వం తరఫున ఈ ప్రక్రియకు నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) మొత్తంగా 18 స్థలాలకు వేలం ప్రకటన విడుదల చేసింది. ఇందులో బీచ్ రోడ్డులో ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాల అత్యంత విలువైన భూమికి ఎన్‌బీసీసీ రూ. 1452 కోట్లను ఆఫ్‌సెట్ ప్రైస్ (రిజర్వ్ ధర)గా నిర్ణయించింది. ఈ భూమినే గత టీడీపీ ప్రభుత్వ హయంలో దుబాయ్‌కి చెందిన ‘లులూ’ గ్రూప్‌కి కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, సినిమా థియేటర్లు కట్టేందుకు లీజుకు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని రద్దు చేసింది. బీచ్ రోడ్డులోని స్థలంతో పాటు విశాఖపట్నంలోని అగనంపూడి, ఫకీర్ టకీయా ప్రాంతాలలోని మరో 17 ఆస్తులు కూడా ప్రభుత్వం వేలానికి పెట్టిన వాటిలో ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో పాపులర్ యాక్టర్ మృతి.. షాక్‌లో చిత్రపరిశ్రమ…
ఘోరం, దారుణం, ఢిల్లీ ఆసుపత్రి ఆవరణలో ‘ఓపెన్ ఐసీయూ’, కోవిడ్ రోగుల పరిస్థితి వర్ణనాతీతం