TDP – YCP: ఏపీలో నిరసన జ్వాలలు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ – టీడీపీ నేతల పోటా పోటీ ఆందోళనలు..

|

Oct 20, 2021 | 7:43 AM

ఒక్క మాట... మంటలు రేపింది. రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. ముట్టడి, పరస్పర ఘర్షణలతో రాష్ట్రం అట్టుడుకేలా చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ నేతల..

TDP - YCP: ఏపీలో నిరసన జ్వాలలు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ - టీడీపీ నేతల పోటా పోటీ ఆందోళనలు..
Ycp Vs Tdp
Follow us on

ఒక్క మాట… మంటలు రేపింది. రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. ముట్టడి, పరస్పర ఘర్షణలతో రాష్ట్రం అట్టుడుకేలా చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య చెలరేగిన మాటలు మంటలు ఇవాళ నిరసనలకు చేరింది. పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చాయి రెండు పార్టీలు. టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ జరుగుతోంది. ఆర్టీసీ బస్సులను డిపోల దగ్గరే ఆపేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్ ను వ్యక్తిగతంగా దూషించినందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని వైసీపీ నిర్ణయించింది.  రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ చేపడుతున్న బంద్‌కు పోటా పోటీగా అధికార పార్టీ వైసీపీ సైతం అన్ని జిల్లాల్లో కౌంటర్‌ ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది.

పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాము శాంతియుతంగా నిరసనలు చేస్తే తమ పార్టీ శ్రేణులపై టీడీపీ నేతలే దాడులకు దిగారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ముట్టడి, పరస్పర ఘర్షణలతో ఏపీ అట్టుడుకేలా చేసింది. విధ్వంసం వెనుక వైసీపీ ఉందని ప్రతిపక్షం ఆరోపిస్తే.. టీడీపీ కవ్వింపు చర్యలే కారణమని అధికార పార్టీ విమర్శిస్తోంది.

ఇవి కూడా చదవండి: PM Modi: అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. భారీగా తరలివస్తున్న బౌద్ధ బిక్షువుల

Telangana MLA: ఓ అవ్వ దయ్యం వచ్చిందటగా.. రమ్మను దాని సంగతి చూస్తా.. పల్లెటూర్లో ఎమ్మెల్యే హల్ చల్..