ఏపీ మంత్రివర్గంలో ఎప్పుడైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అందుకు జగన్ సంకేతాలు ఇచ్చారా? అనే చర్చ అధికార పార్టీలో ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న వారు రెండున్నరేళ్ల మాత్రమే ఉంటారని, తరువాత కొత్తవారికి అవకాశం ఉంటుందని ప్రకటించారు సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చి జనవరి నాటికి రెండున్నరేళ్లు కావస్తుంది. దీంతో త్వరలోనే కేబినెట్‌లో ఉన్నవారికి ఉద్వాసన పలుకుతారన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరుంటారు.. ఎవరు ఉండరో అని లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. పనితీరు ఆధారంగానే మార్పులు చేర్పులు ఉంటాయన్న చర్చ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా.. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తారా, లేదా అని పార్టీలో చర్చించుకుంటున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే జగన్ కసరత్తు ప్రారంభించారు. 2019 వంటి ఫలితాలే సాధించాలనే పట్టుదలతో ఉన్నారు వైసీపీ అధినేత. అందుకే త్వరలో జరగబోయే మంత్రివర్గ మార్పులు 2024 ఎన్నికల టీమ్‌గానే ఉండనుందని చర్చ జరుగుతుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం మంత్రివర్గంలో ఉండి, తొలగించిన వారికి ఎన్నికల భాద్యతను అప్పగించనున్నారు జగన్. ఇదే విషయాన్ని ప్రకటించారు మంత్రి పేర్నినాని. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 20 శాతం కొనసాగుతారని, 80 శాతం మందిని తప్పించి పార్టీ భాద్యతలు అప్పగిస్తారన్న సంకేతాలు ఇచ్చారు పేర్ని నాని. దీంతో మంత్రివర్గ విస్తరణా? లేక పూర్తిస్థాయిలో ప్రక్షాళన అన్నదానిపై త్వరలో క్లారిటీ రానుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి నాటికి కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని వైసీపీలో చర్చించుకుంటున్నారు.
Also Read: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకం.. సినీ వర్గాలతో ఏపీ సర్కార్ కీలక మీటింగ్