దెయ్యం భయ్యం ఆ ఉరి ప్రజలకు కంటిమీద కునుకు లేకండా చేసింది. ఓ పాడుబడ్డ ఇంట్లో వింత శబ్దాలు-వరుస మరణాలతో ఏకంగా ఊరు కాళిచేసి వలస వెళ్ళిపోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. జనగాం జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామం.. ఒకప్పుడు జనంతో కలకలాడిన ఈ గ్రామం ఇప్పుడు ఇలా కలతప్పడానికి కారణం దెయ్యం భయం.. గ్రామంలో ఈ వింత భయం గత కొద్ది రోజులుగా హాల్ చల్ చేస్తుంది.
పోతారం గ్రామంలోని బేడ బుడుగజంగాల కాలనీలోని వాసులకి ఈ భయం పట్టుకుంది. దీంతో ఏకంగా నాలబైకి పైగా కుటుంబాలు ఇండ్లకు తాళం వేసి మండల కేంద్రానికి మకాం మార్చారు. గత సంవత్సరం ఆక్టోబర్ మాసంలో బాను అనే వ్యక్తి అకాల మరణం చెందారు. బాను పెద్దకర్మ గడవక ముందే అయన సోదరుడు బాలరాజు అకస్మాత్తుగా మరణించాడు. ఇక గత ఇరవై రోజుల క్రితం రాజు అనే వ్యక్తి గ్రామ శివారున రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
అయితే ఈ మరణాలకు ఎదో జరిగిందని, అది చేతబడా,మరేదైనా శక్తా అని వారి మనస్సుల్లో నాటుకుంది. ఇంకేముంది మంత్రగాళ్ళు, తంత్రగాళ్లు చెప్పిన మాటలతో మరింత భయాందోళనకు గురయ్యారు. కాలనీలో దెయ్యం ఉండటం వల్లనే అకాల మరణాలు భవిస్తున్నాయనే అనునుమానం పెనుభూతమైంది. కాలనీలో రాత్రిళ్ళు దెయ్యం తిరుగుతుందని మహిళా రూపంలో నృత్యం చేస్తూ అర్దారాత్రి కనిపిస్తుందని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆ కాలనీలో ఉన్న వారికి భయం పట్టుకోవడం.. ఒకరి వెనక ఒకరు క్యూ కట్టి ఊరు విడిచారు.
ఇక తమ గ్రామంలో మరణాలు సాధారణమైనవే. దానికి దెయ్యం భయం ముడిపెట్టడం సరికాదంటున్నారు గ్రామస్తులు. పోలీసులు కళాజాత చేపట్టి అవగాహన కల్పించినా వారు వినిపించుకోకుండా వెళ్లిపోయారు. వాస్తవాలు తెలుసుకుని మళ్లీ వస్తే స్వాగతం పలుకుతామంటున్నారు స్థానికులు. ఈ విషయంలో మూఢ నమ్మకాలపై అవహగన కల్పించినా ఫలితం లేకుండా పోయిందని మరోసారి సాంకేతిక రూపంలో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తామంటున్నారు పోలీసులు.
Read more:
రేపు భారత్ బంద్.. పెట్రోలియం రేట్లు, జీఎస్టీకి నిరసనగా అఖిలభారత వ్యాపార సమాఖ్య పిలుపు