AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత వాయుసేనకు కొత్త బాస్.. 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా అశుతోష్ దీక్షిత్

భారత వైమానిక దళానికి కొత్త అధిపతి నియమితులయ్యారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్‌ను తదుపరి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అక్టోబర్ 31న ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పదవీ విరమణ చేయనుండగా.. అదే రోజు మధ్యాహ్నం దీక్షిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన భారత వైమానిక దళానికి 29వ అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు.

భారత వాయుసేనకు కొత్త బాస్.. 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా అశుతోష్ దీక్షిత్
Air Marshal Ashutosh Dixit
Balaraju Goud
|

Updated on: Oct 06, 2026 | 7:39 PM

Share

న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి కొత్త అధిపతి నియమితులయ్యారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్‌ను తదుపరి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అక్టోబర్ 31న ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పదవీ విరమణ చేయనుండగా.. అదే రోజు మధ్యాహ్నం దీక్షిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన భారత వైమానిక దళానికి 29వ అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సేవా అనుభవం ఉన్న అశుతోష్ దీక్షిత్ ఫైటర్ పైలట్. 1986 డిసెంబర్ 6న ఐఏఎఫ్ ఫైటర్ స్ట్రీమ్‌లో చేరిన ఆయన.. ప్రయోగాత్మక టెస్ట్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందించారు. ఇప్పటివరకు 3,500 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఆయనకు ఉంది. మిరాజ్-2000, వివిధ మిగ్ వేరియంట్లు, జాగ్వార్, కిరణ్, హాక్, ఐఎల్-78, తేజస్ తదితర విమానాలను నడిపారు.

ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, కోప్ ఇండియా, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక ఆపరేషన్లు, విన్యాసాల్లో దీక్షిత్ పాల్గొన్నారు. మిరాజ్-2000 స్క్వాడ్రన్‌తో పాటు పశ్చిమ రంగంలోని ఫ్రంట్‌లైన్ ఫైటర్ బేస్, దక్షిణ రంగంలోని ఫైటర్ ట్రైనింగ్ బేస్‌కు కమాండర్‌గా పనిచేశారు. అంతేకాదు కేంద్ర ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2026 జూలైలో వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. తేజస్ సహా స్వదేశీ విమాన ప్రాజెక్టులు, వైమానిక దళ ఆధునికీకరణలోనూ ఆయనకు కీలక అనుభవం ఉంది. దీక్షిత్ సేవలకు గుర్తింపుగా 2006లో వాయుసేన పతకం, 2011లో విశిష్ట సేవా పతకం, 2023లో అతి విశిష్ట సేవా పతకం, 2026లో పరమ విశిష్ట సేవా పతకం లభించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు