5

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‍లో చేరిన ‘ఊర్మిళ మటోండ్కర్’

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లోకి వలసల బాట కొనసాగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ బుధవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నా తొలి అడుగులను కాంగ్రెస్ పార్టీతో వేస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేస్తానని ఆమె చెప్పారు. ఊర్మిళ వెంట మహారాష్ట్ర విభాగం కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్ ఉన్నారు. ఊర్మిళ ముంబై నార్త్ నుంచి […]

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‍లో చేరిన 'ఊర్మిళ మటోండ్కర్'
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 27, 2019 | 7:14 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లోకి వలసల బాట కొనసాగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ బుధవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నా తొలి అడుగులను కాంగ్రెస్ పార్టీతో వేస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేస్తానని ఆమె చెప్పారు. ఊర్మిళ వెంట మహారాష్ట్ర విభాగం కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్ ఉన్నారు.

ఊర్మిళ ముంబై నార్త్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున గోపాల్ శెట్టి పోటీ చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 1980లో మరాఠీ చిత్రం జాకోల్‌తో బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టిన ఊర్మిళ.. కలియుగ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘రంగీలా’ చిత్రంతో ఆమె సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగులో వర్మ డైరెక్షన్లో నాగార్జునతో కలిసి ‘అంతం’, జగపతిబాబుతో ‘గాయం’ చిత్రాల్లో ఆమె నటించారు.