ప్యాకేజీల కోసమే సినీ నటులు వైసీపీలో చేరుతున్నారు

ప్యాకేజీల కోసమే సినీ నటులు వైసీపీలో చేరుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. సినిమాల్లో అవకాశాలు లేని వారే వైసీపీలో చేరుతున్నారని.. వారి వలన ఓట్లు పడవంటూ ఆయన అన్నారు. జీవితా రాజశేఖర్ తిరగని పార్టీ లేదని, ప్రచారం కోసం జయసుధకు ప్యాకేజీ ఇచ్చారని ఆయన విమర్శలు చేశారు. ఇక వైసీపీకి స్టార్ క్యాంపెయిన్‌గా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీ ప్రజలు మార్పు కోరుతున్నారని మోదీ ట్వీట్ చేశారని.. మోదీని […]

ప్యాకేజీల కోసమే సినీ నటులు వైసీపీలో చేరుతున్నారు

Edited By:

Updated on: Apr 02, 2019 | 2:17 PM

ప్యాకేజీల కోసమే సినీ నటులు వైసీపీలో చేరుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. సినిమాల్లో అవకాశాలు లేని వారే వైసీపీలో చేరుతున్నారని.. వారి వలన ఓట్లు పడవంటూ ఆయన అన్నారు. జీవితా రాజశేఖర్ తిరగని పార్టీ లేదని, ప్రచారం కోసం జయసుధకు ప్యాకేజీ ఇచ్చారని ఆయన విమర్శలు చేశారు. ఇక వైసీపీకి స్టార్ క్యాంపెయిన్‌గా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీ ప్రజలు మార్పు కోరుతున్నారని మోదీ ట్వీట్ చేశారని.. మోదీని ఓడించాలని ప్రజలు అనుకుంటున్న మాట నిజమేనని ఆయన అన్నారు. ‘అబద్ధాల కోరు జగన్‌’ను, ‘ట్వీట్ రాయుడు మోదీ’ని ప్రజలు ఎవరూ నమ్మరు అంటూ రాజేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు.