24 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై.. ఎవరా ఇద్దరు..?

| Edited By:

Apr 19, 2019 | 4:30 PM

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సీన్ ఇది. 24 ఏళ్ల తర్వాత ఒకే వేదికను ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి పంచుకున్నారు. మెయిన్‌పూరిలో ములాయం సింగ్‌ తరపున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ములాయం.. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ మాయావతిని గౌరవించాలని, ఇన్నేళ్ల తర్వాత ఆమెతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. మెయిన్‌పూరి నా కర్మభూమి అని పేర్కొన్నారు. ఎస్పీ – […]

24 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై.. ఎవరా ఇద్దరు..?
Follow us on

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సీన్ ఇది. 24 ఏళ్ల తర్వాత ఒకే వేదికను ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి పంచుకున్నారు. మెయిన్‌పూరిలో ములాయం సింగ్‌ తరపున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ములాయం.. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ మాయావతిని గౌరవించాలని, ఇన్నేళ్ల తర్వాత ఆమెతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. మెయిన్‌పూరి నా కర్మభూమి అని పేర్కొన్నారు. ఎస్పీ – బీఎస్పీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ములాయం కోరారు.

ఇక దేశ భవిష్యత్తు కోసమే విభేదాలను పక్కనపెట్టి ఎస్పీతో చేతులు కలిపామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వల్ల పేదలకు న్యాయం జరగదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు, వెనుకబడిన వర్గాలకు ఇతోధికంగా ఉద్యోగాలు వస్తాయని ఆమె హామీ ఇచ్చారు. దేశ భవిష్యత్‌ కోసం కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మెయిన్‌పూరిలో ములాయం సింగ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.