సినీ రంగంలో సరికొత్త ఛాలెంజ్.. అంతరిక్షంలో సినిమా.. హీరోహీరోయిన్లతో కలిసి నింగిలోకి స్టార్ డైరెక్టర్..

| Edited By: Ravi Kiran

Oct 06, 2021 | 8:59 AM

ఇప్పటివరకు వచ్చిన అంతరిక్ష సినిమాలన్ని నేలపై తీసినవే. చిత్రంలో ఉంటే అంతరిక్ష సన్నివేశాలను ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్‏లో చిత్రీకరించినవే. అంతేకాకుండా.. అంతరిక్షంలోని సన్నివేశాలను గ్రాఫిక్స్ రూపంలోనూ కొన్ని సినిమాల్లో చూశాము. కానీ అంతరిక్షం పై సినిమా షూటింగ్ చేయడం గురించి ఎప్పుడూ వినలేదు కదా.. టెక్నాలజీ వాడకంలో మానవులు మరింత ముందుకెళ్తున్నారు.

1 / 11
ఇప్పటివరకు మనుషులను అంతరిక్షంలోకి పంపి.. అక్కడి వాతావరణనాన్ని అంచనా వేశారు. కానీ ఇప్పుడు నేరుగా అంతరిక్షంలో సినిమా చిత్రీకరించనున్నారు.

2 / 11
ఇందుకోసం హీరోహీరోయిన్లతో పాటు డైరెక్టర్ సైతం నింగిలోకి వెళ్లారు. ఏంటీ ఇదంతా వింటే.. ఏదో సినిమా స్టోరీలాగా అనిపిస్తుంది కదా.. కానీ ఇది నిజం..

3 / 11
అంతరిక్షంలో సినిమా షూటింగ్ చేసేందుకు స్టార్ హీరోహీరోయిన్లతోపాటు.. డైరెక్టర్ సైతం ప్రత్యేక వ్యోమనౌకలో ఈరోజు అంతర్జాతీయ  అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఐస్)కు వెళ్లారు.

4 / 11
ఈఏడాది ప్రారంభంలో అంతరిక్షంలో సినిమా షూటింగ్ చేయబోతున్నట్లుగా రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ  సినిమా షూటింగ్ కోసం సన్నాహాలు మొదలుపెట్టింది.

5 / 11
ది ఛాలెంజ్ అనే సినిమా షూటింగ్ కోసం హీరోయిన్ యులియా పెరెసిల్డ్, చిత్ర దర్శకుడు క్లిమ్ షిషెంకో, మాజీ సోవియట్ కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి 0855 GMT వద్ద రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్‌ ఎంఎస్‌19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్‌ ష్కాప్లెరోవ్‌తో కలిసి నింగిలోకి వెళ్లారు.

6 / 11
డైరెక్టర్ హీరోయిన్ 12 రోజులపాటు.. అంతర్జాతీయ కేంద్రంలో ఉండి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

7 / 11
అంతరిక్ష కేంద్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి  ఓ డాక్టర్ అంతరిక్షంకు వెళ్లే సన్నివేశం షూట్ చేయనున్నారు. సినిమాలో ఈ సీన్ దాదాపు 35  నుంచి 40 నిమిషాలు ఉండనున్నట్లుగా సమాచారం.

8 / 11
ఇక డాక్టర్ పాత్రలో హీరోయిన్ యులియా నటించనుంది. ఈ పాత్ర కోసం గతేడాది ఆడిషన్స్ నిర్వహించగా.. అందులో యులియా ఎంపికయ్యింది. ఇక ఈ సినిమా కోసం ఆమె కొంతకాలం శిక్షణ కూడా తీసుకుంది.

9 / 11
ఇంతకు ముందు మిషన్ ఇంపాజిబుల్ హీరో టామ్ క్రూజ్ నాసా, ఎలోన్ మాస్క్ యొక్క స్పేస్ఎక్స్‏తో కలిసి అంతరిక్షంలో సినిమా తీయనున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ పై ఎలాంటి స్పందన రాలేదు.

10 / 11
ఇక అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశంగా రష్యా నిలవనుంది.

11 / 11