- Telugu News Photo Gallery World photos Meet vistagen scientists reconstruct face of stone age teen who died in norway 8300 years ago
Stone Age Teen: 8300 ఏళ్ల క్రితం నార్వే గుహలో నివసించిన బాలుడి అవశేషాలతో 3D చిత్రాన్ని రూపొందించిన కళాకారుడు
8300 సంవత్సరాల క్రితం నార్వే గుహలో నివసించిన బాలుడుకి చెందిన అవశేషాలను శాస్త్రవేత్త స్వీడిష్ కనుగొన్నారు. వీటి ఆధారంగా ఫోరెన్సిక్ కళాకారుడు ఆస్కార్ నీల్సన్ బాలుడి 3D చిత్రాన్ని రూపొందించారు. బాలుడి అవశేషాలను జోడించిన తరువాత, శరీరంలోని 32 భాగాల కొలతలు తీసుకున్నారు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని సిద్ధం చేశారు
Updated on: Jul 23, 2023 | 8:07 PM

8300 ఏళ్ల క్రితం నార్వేలోని ఓ గుహలో ఒంటరిగా నివసిస్తున్న బాలుడి చిత్రాన్ని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. తొలిసారిగా బాలుడికి సంబంధించిన ఫేస్ ఫొటోను విడుదల చేశారు. శాస్త్రవేత్తలు దీనికి విస్టెగాటన్ అని పేరు పెట్టారు. 1907లో లభించిన అవశేషాల ఆధారంగా బాలుడి చిత్రాన్ని రూపొందించారు. ఆ కాలంలో గుహలో ఒంటరిగా నివసించే రాతియుగం నాటి విస్టాగ్టన్‌కు అనుబంధంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

స్వీడిష్ ఫోరెన్సిక్ కళాకారుడు ఆస్కార్ నీల్సన్ దొరికిన అవశేషాల ఆధారంగా బాలుడి 3డి చిత్రాన్ని సిద్ధం చేశారు. బాలుడి అవశేషాలను జోడించిన తరువాత శరీరంలోని 32 భాగాల కొలతలు తీసుకున్నారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సిద్ధం చేశారు. ఒక వ్యక్తి శరీరం ఎంత కండలు కలిగి ఉండాలనేది అతని జాతి, వయస్సు, లింగం, బరువు ఆధారంగా నిర్ణయించబడుతుంది. అదేవిధంగా అవశేషాల రూపంలో లభించిన అస్థిపంజర విశ్లేషణ ప్రకారం విస్టెగాటన్ చిత్రం తయారు చేశారు.

పరిశోధకుల ప్రకారం 15 ఏళ్ల బాలుడు పశ్చిమ నార్వేకు చెందినవాడు. అతని శరీరం పొడవు 4 అడుగుల 1 అంగుళం అని అవశేషాల ద్వారా తెలిసింది. అతని ముఖం పొడవుగా.. నుదురు గుండ్రంగా ఉంది. బాలుడి అవశేషాల నుండి అనేక రకాల విషయాలను సేకరించారు. ఉదాహరణకు బాలుడి DNA నమూనా సహాయంతో అతని జుట్టు రంగు తెలిసింది. కళ్ళు, చర్మపు రంగు DNA ఆధారంగా రూపొందించారు.

నీల్సన్ మాట్లాడుతూ బాలుడి అవశేషాలను చూస్తుంటే.. అతడిని ఖననం చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో వెలుగు చూసిన విషయాలను బట్టి ఆ బాలుడు ఎలా చనిపోయాడో చెప్పడం కష్టమే. చుట్టూ అస్థిపంజరాలు లేదా అవశేషాలు కనిపించలేదు కనుక.. బాలుడు గుహలో ఒంటరిగా నివసించాడని చెప్పారు. అయితే ఆ బాలుడు 15 నుండి 20 మంది వేటగాళ్ల బృందంలో భాగమై ఉండవచ్చని చెప్పారు.

ఇప్పటివరకు బాలుడు అవశేషాల నుండి అందిన సమాచారం ఆధారంగా బాలుడు ఆ కాలంలోని ప్రజలు ధరించే దుస్తులనే ధరించాడు. గుహలో దొరికిన చేపల హుక్ అతని చేతుల్లో చిక్కుకుంది. ఇది ఆ కాలంలో ఎవరైనా బాలుడికి బహుమతిగా ఇచ్చినట్లు భావిస్తున్నారు.





























