- Telugu News Photo Gallery World photos Know the rs ophiuchi star 4566 light years away erupt now visible with naked eye from earth
భూమికి 4,566 కాంతి సంవత్సరాల దూరంలో అద్భుత దృశ్యం.. కంటితో నేరుగా చూడవచ్చు.. అసలు విషయం తేల్చిన శాస్త్రవేత్తలు..
ఈ భూమండలంపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు.. ప్రస్తుత టెక్నాలజీలో విశ్వంపైగల నక్షత్రాలు, గ్రహాల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయాణిస్తున్నారు. అయితే ఇటీవల ఆకాశంలో ఓ అధ్బుత దృశ్యం కనిపించింది. అదెంటో తెలుసుకుందామా.
Updated on: Aug 13, 2021 | 1:40 PM

విశ్వంలో ఉన్న ఓ నక్షత్రం... భూమికి 4000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానిని భూమి నుంచి నేరుగా కంటితో చూడవచ్చు. ఈ నక్షత్రం ఓఫిచస్ రాశిలో ఉంది. అయితే ముందు ఈ నక్షత్రం 12 మాగ్నిట్యూడ్గా ఉండే.. కానీ ఆ నక్షత్రం పేలడం వలన ప్రస్తుతం అది 4.8 మాగ్నిట్యూడ్గా మారింది.

భూమి నుంచి విశ్వంలోని ఒక వస్తువును చూడటానికి ఖగోళ శాస్త్రవేత్తలు మాగ్నిట్యూడ్‌ను ఉపయోగిస్తారు. 6.5 మాగ్నిట్యూడ్ ద్వారా ఏదైనా వస్తువును నేరుగా కళ్ల ద్వారా చూడవచ్చు. కానీ అది కాంతి వల్ల కలిగే కాలుష్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆకాశం స్పష్టంగా ఉంటేనే అది కనిపిస్తుంది.

ఆర్ఎస్. ఓఫిచస్ అనే అరుదైన రకం ఖగోళ ఘటన. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ట్రిలియన్ నక్షత్రాలలో కేవలం 10 మాత్రమే పాలపుంతలో కనుగొన్నారు. అయితే ఈ నక్షత్రంలోని కాంతిని కంటితో చూడాలంటే అది తక్కువ కాంతి ఉన్న ప్రదేశంలో నుంచి మాత్రమే చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు ఇది రెండు నెలల పాటు కనిపిస్తుంది.

అయితే నక్షత్రంలో పేలుడు సంఘటన భూమి నుంచి 4566 కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే దాదాపు ఆ దృశ్యం 4566 సంవత్సరాల క్రితం జరిగిందని అర్థం. కానీ దాని కాంతి భూమిపైకి రావడానికి చాలా సమయం పట్టింది.

ఆర్ఎస్.ఓఫిచస్ ఒక బైనరీ నక్షత్రం. ఇది క్రమం తప్పకుండా తరుచుగా ప్రకోపిస్తుంది. ఇది ఒక తెల్ల మరగుజ్జు నక్షత్రం. ఇది రెడ్ జాయింట్ స్టార్ కక్ష్యకు దగ్గరగా ఉంటుంది. హైడ్రోజన్ రెడ్ జాయింట్ స్టార్ నుంచి క్రమం తప్పకుండా బయటకు వస్తుంది. అలాగే చిన్న నక్షత్రంగా మారుతుంది.

అలా మారుతున్న సయమంలో భూమి పై నుంచి ఆ దృశ్యాన్ని కెమెరాల ద్వారా బంధించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో నక్షత్రం ఎలా పేలుతుందో చూడవచ్చు. ఆ తర్వాత దాని నుంచి కాంతి ఎలా బయటకు వస్తుందో చూడవచ్చు.

భూమికి 4,566 కాంతి సంవత్సరాల దూరంలో అద్భుత దృశ్యం.
