- Telugu News Photo Gallery White Turmeric: These Incredible Health Reasons To Add This Spice To Your Diet Plan
Benefits White Turmeric: బెస్ట్ మెడిసిన్ తెల్ల పసుపు.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. అందుకే అంత ఖరీదు
తెల్ల పసుపు, దీనిని జెడోరీ లేదా అడవి పసుపు అని కూడా పిలుస్తారు. తెల్ల పసుపు ఒక విలక్షణమైన సువాసనను కలిగి ఉంటుంది. ఈ తెల్ల పసుపుని మందులు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల ఆహారాల తయారీలలో ఉపయోగిస్తారు.
Updated on: May 29, 2023 | 12:58 PM

తెల్ల పసుపు మొక్క ఇండోనేషియాకు చెందినది. అయితే ఐరోపా, భారతదేశం, USలో కూడా సాగు చేస్తున్నారు. మన దేశంలో అసాధారణమైన చారిత్రాత్మక మసాలాగా ఖ్యాతిగాంచింది. ఇది అల్లం, పసుపు వంటి ఒకే కుటుంబానికి చెందినది. అయితే విలక్షణమైన సువాసనను కలిగి ఉంటుంది. ఈ తెల్ల పసుపు మసాలా, అల్లం రుచిగా ఉంటుంది. ఈ అడవి పసుపును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

తెల్ల పసుపులో అద్భుతమైన ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మోటిమలు, హైపర్పిగ్మెంటేషన్, అవాంఛిత రోమాలను తొలగించడానికి ఉపయోగించబడుతుంది. ఇది శిశువులకు చర్మ సంరక్షణలో మంచి సహాయకారి. ఈ అడవి పసుపు చర్మ సంరక్షణతో పాటు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నినియంత్రిస్తుంది.

సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సలో.. యాంటీ మైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కోసం పసుపు పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ పసుపు కర్పూరం లాంటి వాసనను కలిగి ఉంటుంది. తెల్ల పసుపు టీ డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని నూనె జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

ఈ తెల్ల పసుపులో క్యాన్సర్ నిరోధక గుణాలు అధికంగా ఉన్నాయి. శతాబ్దాలుగా, తెల్ల పసుపును క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. తెల్ల పసుపు క్యాన్సర్ నిరోధక ప్రయోజనాలు కర్కుజెడోఅలైడ్ కారణంగా ఉన్నాయి. రొమ్ము, అండాశయం, కడుపు సహా అనేక రకాల క్యాన్సర్‌లను నివారించడంలో తెల్ల పసుపు నీటి సారం ఉపయోగపడుతుందని తేలింది.

ఈ అడవి పసుపు మొక్క అన్ని భాగాలను ఔషధంగా ఉపయోగించినప్పటికీ, బెండు (మూలాలు) చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అడవి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుస్కలంగా ఉంటాయి. ఇది దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఈ తెల్ల పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల స్రావానికి సహాయపడుతుంది. అనేక రకాల జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తెల్ల పసుపును విస్తృతంగా ఉపయోగిస్తారు.

అడవి పసుపు ఆర్థరైటిస్ ను నివారిస్తుంది. పసుపులో నిరోధక శక్తి అధికం. యాంటీఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, న్యూరోప్రొటెక్టివ్ పదార్ధాలను కలిగి ఉన్నాయి. ఇవి ఆర్థరైటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ అడవి పసుపుకి మసాలా దినుసుగా తినే ఆహారంలో ఉపయోగించవచ్చు. టీ గా తీసుకోవచ్చు.




