Sprouts: మొలకలు ఏ టైంలో తినాలో తెలుసా? చాలా మంది చేసే పొరబాటు ఇదే
మొలకెత్తిన పెసలు తినడ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రోటీన్ వంటి అనేక ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి..
Updated on: Oct 05, 2025 | 12:59 PM

మొలకెత్తిన పెసలు తినడ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

మొలకల్లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రోటీన్ వంటి అనేక ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

మొలకలను ఉదయం అల్పాహారం, రాత్రి భోజనంలో కూడా చేర్చుకోవచ్చు. మీరు వీటిని కూరగాయలు లేదా సలాడ్‌లలో కూడా సులభంగా చేర్చుకోవచ్చు. అయితే రాత్రిపూట మొలకలు తినడం అంత మంచిదికాదు.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ ఆహారంలో ఎక్కువగా మొలకలను చేర్చుకోవాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మొలకెత్తిన పెసరపప్పు తినడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. అల్పాహారంగా పెసరపప్పును తయారు చేసుకుని తినవచ్చు. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.




