- Telugu News Photo Gallery Weight Loss Tipes: Banana vs apple? Which fruit is better for weight loss?
Banana vs Apple: యాపిల్..? అరటి పండ్లు..? బరువు తగ్గడానికి ఏది బెస్ట్!
చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇందులో సగం మందికి బరువు తగ్గడానికి అసలైన పద్ధతి ఏమిటో తెలియదు. దీంతో బరువు తగ్గడానికి బదులుగా మరింత పెరుగుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి తప్పుడు డైట్ పాటించడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది..
Updated on: Sep 27, 2025 | 12:34 PM

చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇందులో సగం మందికి బరువు తగ్గడానికి అసలైన పద్ధతి ఏమిటో తెలియదు. దీంతో బరువు తగ్గడానికి బదులుగా మరింత పెరుగుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి సువులైన మార్గం పండ్లు తినడం. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే, ఏయే పండ్లు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

అరటిపండ్లు, యాపిల్స్.. బరువు తగ్గాలనుకునే వారి తొలి ప్రాధాన్యం ఇవి. తక్షణ శక్తిని పెంచే లక్షణాలు అరటిలో పుష్కలంగా ఉంటాయి. ఇక యాపిల్స్ మాత్రం ఫైబర్, తక్కువ కేలరీల కోసం ప్రాధాన్యతనిస్తాయి. కొంతమంది బరువు తగ్గడానికి అరటిపండ్లు, ఆపిల్స్ రెండింటినీ తినేస్తుంటారు.

బరువు తగ్గడానికి ఖచ్చితంగా ఏమి తినాలో ఇక్కడ తెలుసుకుందాం. అరటిపండ్లు, యాపిల్.. ఈ రెండింటిలో అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

బరువు తగ్గాలనుకుంటే రోజువారీ ఆహారంలో అరటిపండ్లకు బదులుగా యాపిల్‌లను చేర్చుకోవాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది.

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే ప్రతి ఉదయం అల్పాహారంగా ఒక యాపిల్ తినడం అలవాటు చేసుకోండి. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.




