Head Bath In Periods: పీరియడ్స్ టైంలో తలస్నానం చేస్తే ఏమవుతుంది?
పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయకూడదని చాలా మంది అంటుంటారు. అందుకే చాలా మంది ఈ సమయంలో తల స్నానం మానేస్తారు. అయితే దీని వెనుక నిజంగా ఏదైనా కారణం ఉందా? అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి చాలా ఇళ్లలో ఇప్పటికీ పీరియడ్స్ సమయంలో స్త్రీలను వంటగదిలోకి కూడా..
Updated on: Sep 27, 2025 | 11:21 AM

పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయకూడదని చాలా మంది అంటుంటారు. అందుకే చాలా మంది ఈ సమయంలో తల స్నానం మానేస్తారు. అయితే దీని వెనుక నిజంగా ఏదైనా కారణం ఉందా? అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి చాలా ఇళ్లలో ఇప్పటికీ పీరియడ్స్ సమయంలో స్త్రీలను వంటగదిలోకి కూడా అనుమతించరు. ఇలాంటి దురాచారాలు మన దేశంలో వేళ్లూనుకుపోయాయి. వీటిని అంత తేలిగ్గా వదిలించుకోవడం మన సమాజంలో సాధ్యంకాదు.

ఇలాంటి అపోహల్లో పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయకూడదు అనేది ఒకటి. అందుకే చాలా మంది మహిళలు ఈ సమయంలో తల స్నానం చేయరు. కొందరు అసలు స్నానం కూడా చేయరు.

నిజానికి పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత చాలా అవసరం. పీరియడ్స్ సమయంలో ఎంత ఎక్కువ పరిశుభ్రతను పాటిస్తే అంత మంచిది. పీరియడ్స్ సమయంలో ప్రతిరోజూ స్నానం చేయడం అస్సలు మర్చిపోకూడదు.

పీరియడ్స్ సమయంలో స్నానం చేస్తే శరీరం సాంత్వన పొందుతుంది. ఇది అసౌకర్యాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ఇంకా మంచిది.




