బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా..? అయితే ఈ ఐదు ఎక్సర్ సైజులు ఫర్‌ఫెక్ట్..! మొత్తం బర్న్ కావాల్సిందే..
Weight Loss 5 Ways : మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.. అయితే మీ శరీరంలో మోతాదుకు మించి ఉన్న కేలరీలను కరిగించాలి. అందుకోసం మీరు కఠినంగా వ్యాయామం చేయాలి. మీరు ఎంత ఎక్కువ కదిలితే అన్ని కేలరీలు బర్న్ అవుతాయి. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ చేతులను క్రమపద్దతిలో ఊపుతుండాలి.. మీరు రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా చేతులను ఎల్లప్పుడు ఓ క్రమ పద్దతిలో ఊపుతూ ఉండాలి. ఇది తక్కువ వ్యవధిలో కొన్ని కేలరీలను కరిగించడానికి సహాయపడుతుంది. దీనిని అందరు తక్కువగా అంచనా వేస్తారు కానీ దీని వల్ల చాలా ప్రభావం ఉంటుంది.
1 / 5
ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు తక్కువగా విశ్రాంతి తీసుకోండి.. ఎక్కువగా వర్కవుట్స్ చేయండి.. ఇలా చేయడం వల్ల మీ హృదయ స్పందన రేటు ఎక్కువ కాలం పెరుగుతుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి మీకు సహాయపడుతుంది.
2 / 5
ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి మీరు మీ శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టాలి. ట్రెడ్‌మిల్‌పై నడవడం లేదా బరువులు ఎత్తడం చేయడం కంటే కొత్త ఎక్సర్ సైజ్‌లు ప్రయత్నించండి. ఇలా చేస్తే ఎక్కువ కేలరీలు బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
3 / 5
ఎక్కువ కేలరీలను కరిగించడానికి బరువులను ఎత్తడం సులువైన మార్గం. భారీ బరువులు ఎత్తడం ద్వారా మీరు 25 శాతం ఎక్కువ కేలరీలను బర్న్ చేయవచ్చు. భారీ బరువులు కండరాలలో ఎక్కువ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో మీకు సహాయపడతాయి. ఇది తక్కువ వ్యవధిలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి కారణమవుతుంది.
4 / 5
వ్యాయామం చేసేటప్పుడు సంగీతం వినడం వల్ల మీ వ్యాయామం తీవ్రత పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొన్ని ఉల్లాసభరితమైన సంగీతాన్ని ట్యూన్ చేయడం వల్ల మీకు అధికంగా శక్తి వస్తుంది. సాధారణం కంటే 20 శాతం ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి అవకాశం ఉంటుంది.